ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో డిల్లీ దబాంగ్, బెంగళూరు బుల్స్ సమఉజ్జీలుగా నిలిచాయి. ఇరుజట్లు హోరాహోరీగా పోరాడినప్పటికి విజయం ఎవరినీ వరించలేదు.  మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు సమానంగా 39-39 పాయింట్ల వద్ద నిలవడంతో మ్యాచ్ టైగా ముగింసింది.

ఈ ఉత్కంఠ పోరుకు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికయ్యింది. బెంగళూరు ఆటగాళ్లలో పవన్ కుమార్ 17 పాయింట్లతో రాణించాడు. అలాగే అమిత్ 6, బంటి 4, అజయ్ 2, సుమిత్ 2 పాయింట్లు సాధించారు. రైడింగ్ లో 23, ట్యాకిల్స్ 10, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 4 మొత్తం 39 పాయింట్లు సాధించింది.

ఇక  దబాంగ్ డిల్లి రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ ట్రాల ద్వారా 3 మొత్తం 39 పాయింట్లు సాధించింది. నవీన్ 14, చంద్రన్ 5, అనిల్ 4, రవీందర్ 4 పాయింట్లు సాధించారు. అయినప్పటికి బెంగళూరుతో సమానంగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.