రోహిత్ శర్మపై త్రో విసిరిన పృథ్వీషా...భారత జట్టు ప్లేస్ కోసం పృథ్వీషా ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్...ఓపెనర్ ప్లేస్ కోసం పృథ్వీషా గట్టిగా ట్రై చేస్తున్నాడంటూ ఆసీస్ మాజీ ప్లేయర్ బ్రాడ్ హాగ్ ట్వీట్..

ఆస్ట్రేలియాలో మొదటి టెస్టులో చోటు దక్కించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్‌లో ఘోరంగా నిరుత్సాహపర్చిన పృథ్వీ షా... ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్ జారవిడిచి జట్టుకి దూరమయ్యాడు.

భారత జట్టు ప్లేయర్లు వరుసగా గాయపడుతుండడంతో ఆఖరి టెస్టులో పృథ్వీషా ఆడడం తప్పనిసరి అనుకున్నారంతా. అయితే ప్రాక్టీస్‌లో గాయపడిన మయాంక్ అగర్వాల్ కోలుకుని, జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో పృథ్వీషా తీవ్రమైన అసహనానికి గురైనట్టు తెలుస్తోంది.

సైనీ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చిన పృథ్వీషా... నాన్‌ స్టైయికింగ్‌కి త్రో విసిరే సమయంలో అక్కడ నిల్చున్న రోహిత్ శర్మను బంతితో కొట్టాడు. అయితే అదృష్టవశాత్తూ రోహిత్‌ శర్మకి పెద్ద గాయమేమీ కాలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో భారత జట్టులో స్థానంలో పృథ్వీషా ఈ రూటు ఎంచుకున్నట్టు ఉన్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. 

Scroll to load tweet…