బాలీవుడ్ హీరోయిన్ గీతా బస్రా.. ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జోడి త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో.. ఇటీవల గీతా బస్రా.. భజ్జీతో తన పరిచయం.. ప్రేమ విషయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

హర్భజన్ మొదట గీతా బస్రాను ఓ పోస్టర్ లో చూశాడట. ఆ ఫోటోలో చూసి వెంటనే ఫిదా అయిపోయాడు. అంతే.. ఈ అమ్మాయి ఎవరూ అంటూ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడట. అయితే.. గీతా బస్రాకి క్రికెట్ చూసే అలవాటు లేదట. దీంతో.. ఆమెకు అసలు హర్భజన్ ఎవరూ కూడా తెలీదట.  ఆ తర్వాత కష్టపడి.. గీతా వివరాలు కనుక్కొని.. ఆమెను ప్రేమలోకి దింపాడు.

వీరిద్దరూ 2015 అక్టోబర్ 29న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు పూర్తౌతోంది. 2016 జులై 27న ఈ దంపతులకు హినాయా హీర్ పల్హ అనే కుమార్తె జన్మించింది. ఈ ఏడాది జులైలో వీరి రెండో సంతానం భూమి మీదకు రానుంది.

ఇదిలా ఉండగా.. గీతా బస్రా.. 2006లో దిల్ దియా హై సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ది ట్రైన్ సినిమాలో నటించారు. చివరగా పంజాబీ చిత్రం లాక్ సినిమాలో నటించారు అది 2016లో విడుదలైంది. ప్రస్తుతం గీతా బస్రా.. తన మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.