Asianet News TeluguAsianet News Telugu

PBKS vs DC : 4, 6, 4, 4, 6, 1.. హర్షల్ పటేల్ బౌలింగ్ ను దంచికొట్టిన అభిషేక్ పోరెల్.. స‌రికొత్త రికార్డు !

Punjab Kings vs Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య రెండో మ్యాచ్ జ‌రిగింది. పంజాబ్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి తొలి విజ‌యాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయ‌ర్ అభిషేక్ పోరెల్ తన బ్యాట్ తో దుమ్మురేపాడు. 
 

PBKS vs DC : 4, 6, 4, 4, 6, 1.. Abishek Porel washed Harshal Patel's bowling, New record Punjab Kings vs Delhi Capitals RMA
Author
First Published Mar 23, 2024, 10:16 PM IST

Abishek Porel: ఐపీఎల్ 2024 లో 2వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్‌లోని మొహాలీలోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇద్దరూ ఓపెనర్లుగా రంగంలోకి దిగి దూకుడుగా ఆడారు. మార్ష్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు చేయగా, రాహుల్ చాహర్ చేతికి చిక్కిన అర్ష్‌దీప్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అదేవిధంగా దూకుడుగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టులో హర్షల్ పటేల్ తొలి వికెట్ తీశాడు.

ఆ త‌ర్వాత‌ షాయ్ హోప్, రిషబ్ పంత్ లు ఢిల్లీ ఇన్నింగ్స్ ను కొన‌సాగించారు. ఇందులో షాయ్ హోప్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి కజిజో రబాడ బౌలింగ్ లో ఔటయ్యాడు. దాదాపు 454 రోజుల తర్వాత గ్రౌండ్‌కి వచ్చిన రిషబ్ బంట్‌కి భారీ ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయాడు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి ఆ హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్ లో జానీ బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఆ తర్వాత రికీ ఫూయ్ 3, ట్రిస్టన్ స్టబ్స్ 5, అక్షర్ పటేల్ 21, సుమిత్ కుమార్ 2 వరుసగా ఔటయ్యారు.

KKR VS SRH: రస్సెల్ మస్సెల్.. హైదరాబాద్ పై తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆండ్రీ రస్సెల్ దండయాత్ర..

అయితే, ఈ మ్యాచ్ లో చివరి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ చివరలో తుఫానీ ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌రి 10 బంతుల్లో 32 పరుగులల‌తో దుమ్మురేపాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.పంజాబ్‌కు చివరి ఓవర్‌ని హర్షల్‌ పటేల్‌ వేశాడు. పోరెల్ ఈ ఓవర్‌ను ఎదుర్కొన్నాడు. అతను 4, 6, 4, 4, 6, 1 ఫోర్లు, సిక్సర్లతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బౌలింగ్ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అయితే, హ‌ర్ష‌ల్ ప‌టేల్ రెండు వికెట్లు తీశాడు కానీ, భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 175 టార్గెల్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. సామ్ క‌ర్రాన్ 63 ప‌రుగులు, లియామ్ లివింగ్‌స్టోన్ 38 ప‌రుగులు చేశారు.

 

 బ్యాక్ టూ బ్యాక్ సిక్స‌ర్లు.. హైద‌రాబాద్ బౌలింగ్ ర‌ఫ్పాడించిన ఫిలిప్ సాల్ట్..

Follow Us:
Download App:
  • android
  • ios