pat cummins... ఐసీసీ వరల్డ్ కప్ 2023 ట్రోఫీతో స్టేజీపై ఒంటరిగా : సోషల్ మీడియాలో చర్చ

పురుషుల క్రికెట్  ప్రపంచకప్  2023 ట్రోఫీని  అస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే  ట్రోఫీని అందుకున్న సమయంలో పాట్ కమిన్స్ ఒక్కడే  స్టేజీపై ఉన్న కొన్ని క్షణాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

Pat Cummins caught up in 'awkward' trophy presentation scenes after World Cup final lns

న్యూఢిల్లీ: ప్రపంచకప్ పురుషుల క్రికెట్ కప్ ను అస్ట్రేలియా జట్టు దక్కించుకుంది. ఈ ట్రోఫిని అందుకున్న తర్వాత  అస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్  ఒంటరిగా ట్రోఫిని పట్టుకొని నిలబడ్డాడు. అస్ట్రేలియా జట్టుకు చెందిన ఇతర జట్టు సభ్యులు పాట్ కమిన్స్ తో   వేదికను పంచుకోలేదు.ఈ  విషయమై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.

2023, నవంబర్  19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, అస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో  ఇండియాను ఓడించి  ప్రపంచ కప్ ను  అస్ట్రేలియా కైవసం చేసుకుంది.ఈ విజయంతో  ఆరు ప్రపంచ కప్ లను అస్ట్రేలియా జట్టు దక్కించుకున్నట్టైంది.భారత్ జట్టు మాత్రం రెండు ప్రపంచ కప్ లను మాత్రమే సాధించింది.

ప్రపంచకప్ ను సాధించిన అస్ట్రేలియా జట్టుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రి రిచర్డ్ మార్లెస్ ట్రోఫిని అందించారు.

 అస్ట్రేలియా జట్టు సభ్యులతో  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రిచర్డ్ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా  స్టేడియంలో  బాణాసంచా కాల్చారు.ఈ తతంగమంతా సాగుతున్న సమయంలో  అస్ట్రేలియా జట్టు కెప్టెన్  పాట్ కమిన్స్ స్టేజీ పైనే ఎదురు చూస్తూ కన్పించాడు.

అంతేకాదు  ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలు కావడంతో  ఈ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానాలు స్టేడియం నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో స్టేడియం కూడ ఖాళీగా కన్పించింది.

ప్రపంచ కప్ క్రికెట్ ట్రోఫిని అందుకున్న తర్వాత వేదికపై  అస్ట్రేలియా జట్టు కెప్టెన్  పాట్ కమిన్స్  ఒక్కడే కన్పించాడు. అయితే ఆ సమయంలో  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అస్ట్రేలియా ఉప ప్రధానితో  అస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులు కరచాలనం చేస్తూ నిలబడ్డారు.పాట్ కమిన్స్ తో  అస్ట్రేలియా జట్టు సభ్యులు చేరడానికి కొంత సమయం పట్టింది. అప్పటి వరకు  అస్ట్రేలియా జట్టు కెప్టెన్  పాట్ కమిన్స్  వేదికపై  ఒక్కడే నిలబడ్డాడు.  తన జట్టు సహచరుల కోసం  కమిన్స్ ఎదురు చూస్తూ నిలబడ్డాడు. సుమారు  30 సెకన్ల పాటు కమిన్స్ ఇలా ఎదురు చూడాల్సి వచ్చింది.  అయితే  చివరకు అస్ట్రేలియా జట్టు సభ్యులు కమిన్స్ తో జత కలిశారు.   ఈ విషయమై సోషల్ మీడియాలో  చర్చ సాగుతుంది.  అత్యంత ఇబ్బందికరమైన ట్రోఫీ ప్రదర్శన అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

 

ఫైనల్ మ్యాచ్ లో  అస్ట్రేలియా జట్టు సభ్యుడు ట్రావిస్ హెడ్  సెచంరీ చేశారు. అతడిని సన్మానించారు. ఆ తర్వాత  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన విరాట్ కోహ్లిని  కూడ సత్కరించారు.క్రికెట్ ట్రోపీ ప్రజెంటేషన్ ఇంత చెత్తగా ఏనాడూ చూడలేదని  మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు.అస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపిన తర్వాత భారత క్రికెట్ జట్టు సభ్యులు మైదానాన్ని విడిచి వెళ్లారని  ప్రముఖ క్రికెట్  జర్నలిస్ట్ సుందరేశ్  సోషల్ మీడియాలో పేర్కోన్నారు.కెఎల్ రాహుల్, సిరాజ్ లు భావోద్వేగానికి గురైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios