భారత్ ను టార్గెట్ చేశాడు.. చివరకు తన ముఖంపైనే ఉమ్మెసుకున్న పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
Pakistani sports journalist vs BCCI: బీసీసీఐని టార్గెట్ చేసిన పాకిస్థానీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజాను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ట్రోల్స్, మీమ్స్ తో ఈ పాకిస్తానీ జర్నలిస్టుకు మతిపోయిందనుకుంటా అంటూ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోసం చేసిన పనితో పరువు పోగొట్టుకున్నాడు.. !
Pakistani sports journalist vs BCCI : పాకిస్థానీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా భారత్ ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశాడు. దీంతో అందరిముందు నవ్వుల పాలయ్యాడు. ఆసలు జర్నలిస్టువేనా అంటూ నెటిజన్లతో చెప్పించుకునే పరిస్థితిలోకి చేరాడు. ఈ పాకిస్థాని జర్నలిస్టుకు మతిపోయిందనుకుంటా.. అంటూ నెటిజన్లు హాట్ కామెంట్లు, మీమ్స్, ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. బీసీసీని టార్గెట్ చేస్తే చేశాడు కానీ, ఇంత తెలివితక్కువగా ఎందుకు చేశాడని నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.. !
అసలు ఏం జరిగిందంటే.. దాయాది దేశాలపై భారత్-పాకిస్తాన్ విషయాలు అంటే యావత్ ప్రపంచ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక క్రికెట్ గ్రౌండ్ లో ఇరు దేశాలు తలపడుతున్నాయంటే రెండు దేశాలతో పాటు ప్రపంచం మొత్తం చూపు దానిపైనే ఉంటుంది. ఈ క్రమంలోనే రాబోయే రెండు మెగా టోర్నీలను ఐసీసీ పాకిస్తాన్ లో నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత క్రికెట్ జట్టు పాక్ లో పర్యటించడం దాదాపు అసాధ్యం అనే సూచనలు పంపడంతో పాక్ ప్లేయర్లతో పాటు పలువురు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఖాదిర్ ఖవాజా కూడా భారత్ ను టార్గెట్ చేసి ప్రయత్నం చేశాడు.
ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు అందించే ఒక ఫోటోను షేర్ చేశాడు. అయితే, అందులో భారత్ వివరాలు లేకుండా కట్ చేసిన ఫొటోను పంచుకున్నాడు. దీనికి "ధనిక క్రికెట్ బోర్డు జాబితాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉంది... బిలియన్ డాలర్ల బోర్డు (భారత్) ఎక్కడ ఉంది???" అని సమా టీవీ జర్నలిస్ట్ గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్‌లో రాశాసుకొచ్చాడు. అయితే, భారత్ ను తక్కువచేసి చూపించే ప్రయత్నం అతన్నే దెబ్బకొట్టింది. అసలు విషయాన్ని నువ్వు కట్ చేసినంత మాత్రన నిజం కాకుండా పోదుకదా అంటూ నెటిజన్లు పాక్ జర్నలిస్టును టార్గెట్ చేశారు. మీమ్స్, ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ఆకాశం లాంటి నిర్మల మనసున్న భారత్ పై ఉమ్మెయాలని చూశాడు కానీ, చివరకు అది అతని ముఖంపైనే పడింది అంటూ నెటిజట్లు కామెంట్స్ చేస్తున్నారు.
అత్యంత ధనవంత క్రికెట్ బోర్డుల లిస్టులో పూర్తి వివరాలు ఉన్న ఫోటోను పంచుకుంటూ వాస్తవం తెలుసుకోవాలని పాక్ జర్నలిస్టుకు బుద్ది చెప్పారు. అసలు పోస్ట్ లో బీసీసీఐ రూ.18,760 కోట్లతో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా రూ 658 కోట్లు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రూ 492 కోట్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూ 458 కోట్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 425 కోట్లతో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఆర్థిక స్థితిని తెలుపుతూ ఒక నెటిజన్ పూర్తి ఫొటోను పోస్ట్ చేయడంతో పాక్ జర్నలిస్టు ఖవాజా విమర్శలకు టార్గెట్ అయ్యాడు. చాలా మంది అతని పోస్ట్ విశ్వసనీయతను, అతని పాత్రికేయ సమగ్రతను ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
PARIS OLYMPICS 2024: పారిస్ ఒలింపిక్స్ లో మన తెలంగాణ గోల్డ్ మెడల్.. నిఖత్ జరీన్
విరాట్, రోహిత్ రిటైర్మెంట్.. టీమిండియాకు కష్టాలు.. !