టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రపంచకప్ తర్వాత నుంచి ధోని తిరిగి బ్యాట్ పట్టుకోలేదు.

Also Read:ఐపీఎల్ 2020: చెన్నైలో ధోనీకి ధూమ్ ధామ్ స్వాగతం

దీంతో ఆయన రీ ఎంట్రీ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో పాకిస్తాన్ అభిమానులు కూడా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో ప్రస్తుతం పాకిస్తాన్‌లోనూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఓ అభిమాని మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లాడు. తీరా అతని జెర్సీ మీద వున్న పేరు చూసి ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. పాక్ క్రికెట్ జట్టు జెర్సీని ధరించిన సదరు అభిమాని.. దాని వెనుక పేరు పేరు, జెర్సీ నెం.7ని ప్రింట్ చేయించాడు. దీంతో కెమెరాలన్నీ అతనిని టార్గెట్ చేశాయి.

Also Read:పిచ్ రోలర్ డ్రైవ్ చేస్తూ ఎంఎస్ ధోనీ: వీడియో వైరల్

ఓ వ్యక్తి అతని జెర్సీని ఫోటోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే భారతీయులను అంతగా ఇష్టపడని పాకిస్తానీయులు సైతం ధోనీ ఫోటోకు మద్ధతుగా నిలిచి క్రికెట్‌పైనా ధోనీపైనా అభిమానాన్ని చాటుకున్నారు. కాగా ఐపీఎల్ 2020 సీజన్‌‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ చెపాక్ స్టేడియానికి చేరుకున్న ధోనీ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.