Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup: ఆప్గాన్ పై టీమిండియా విజయం.. పాక్ నటి వివాదాస్పద కామెంట్స్

ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా సంచలన ఆరోపణలు చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్‌ అనంతరం చేసిన ట్వీట్‌కు బదులుగా ఆమె రీ ట్వీట్‌ చేయడం గమనార్హం.

Pakistani actor makes huge allegation against BCCI after India beat Afghanistan, Aakash Chopra gives fitting reply
Author
Hyderabad, First Published Nov 5, 2021, 11:38 AM IST


T20 Worldcup లో తొలిసారి టీమిండియాకు విజయం దక్కింది. తొలుత రెండు కీలక మ్యాచుల్లో.. భారత్ ఓటమి చవి చూసింది. కాగా ఇటీవల ఆప్గాన్ పై జరిగిన మ్యాచ్ లో.. ఎట్టకేలకు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌పై టీమిండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ పాకిస్థాన్‌ టీవీ నటి సెహర్‌ షిన్వారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Also Read: T20 WorldCup: టీమిండియాతో ఫైనల్స్ ఆడాలి.. అక్తర్

 ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా సంచలన ఆరోపణలు చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్‌ అనంతరం చేసిన ట్వీట్‌కు బదులుగా ఆమె రీ ట్వీట్‌ చేయడం గమనార్హం.

Also Read: ఒక్క క్రికెటర్‌కి ఇన్ని రికార్డులా... టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వల్ల కానివి, చేసి చూపించిన విరాట్ కోహ్లీ...

వివరాల్లోకి వెళితే.. అఫ్గాన్‌పై విజయానంతరం టీమిండియాకు విషెష్‌ తెలుపుతూ "భారత్‌.. భారత్‌లా ఆడిందంటూ" ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. అయితే, ఆకాశ్‌ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ రిప్లై ఇచ్చిన పాక్‌ నటి.. "BCCI Bought A Good Match" అంటూ రీ ట్వీట్‌ చేసింది. సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలకు ఆకాష్ చోప్రా తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. “వక్రబుద్ది గల మనుషుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీటర్‌ వార్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌ నటిపై టీమిండియా అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు. 

 

కాగా.. కేవలం పాక్ నటి సెహర్ మాత్రమే కాకుండా..  చాలా మంది పాక్ అభిమానులు.. నెట్టింట ఇలాంటి కామెంట్సే చేయడం గమనార్హం. మ్యాచ్ ఫిక్స్ చేసి టీమిండియా గెలిచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పాక్ ఫ్యాన్స్ చేస్తున్న ఆ కామెంట్స్ పై... ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా స్పందించారు.

Also Read: ఆ రోజు విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య అంత గొడవ జరగడానికి కారణమేంటి... ఆ సంఘటన తర్వాత ఇద్దరి మధ్య...

ఇందులోఅనవసరంగా ఆప్గానిస్తాన్ ను నిందించరాదని కోరాడు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఇలా వ్యాఖ్యానించడం పట్ల ఆ జట్టుకు ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. ఆప్గాన్ బలమైన జట్టు కాదని. ఈ మ్యాచ్ లో బలమైన టీమిండియాతో పోటీపడిందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా.. టీమిండియా ఫైనల్ కి రావాలని.. మళ్లీ పాక్ చేతిలో ఓడిపోతే చూడాలని ఉందని అక్తర్ పేర్కొనడం గమనార్హం.

Also Read: T20 Worldcup 2021: శ్రీలంకకు రెండో విజయం... వెస్టిండీస్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్...
 

Follow Us:
Download App:
  • android
  • ios