Asianet News TeluguAsianet News Telugu

T20 WorldCup: టీమిండియాతో ఫైనల్స్ ఆడాలి.. అక్తర్

తాజాగా తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడిన అక్తర్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లకు సంబంధించిన ‘మౌకా’ అడ్వర్టైజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

T20 Worldcup 2021: we want to give india another mauka in the finals
Author
Hyderabad, First Published Nov 5, 2021, 9:44 AM IST

T20 Worldcup మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ ప్రపంచకప్ లో భాగంగా భారత్ రెండు కీలక మ్యాచులను ఓడిపోయి రేసులో వెనకపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలవ్వడం అభిమానులను మరింతగా బాధపెడుతోంది. కాగా.. తాజాగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: ఒక్క క్రికెటర్‌కి ఇన్ని రికార్డులా... టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వల్ల కానివి, చేసి చూపించిన విరాట్ కోహ్లీ...

టీమిండియాతో ఫైనల్స్ ఆడేందుకు తాము ఎదురుచూస్తున్నట్లు షోయబ్ అక్తర: పేర్కొన్నాడు. అక్కడ కూడా మరోసారి టీమిండియాను ఓడించాలని ఉందని.. దానికోసమైన భారత్ ఫైనల్స్ కి రావాలని అక్తర్ పేర్కొనడం గమనార్హం. తాజాగా తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడిన అక్తర్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లకు సంబంధించిన ‘మౌకా’ అడ్వర్టైజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: ఆ రోజు విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య అంత గొడవ జరగడానికి కారణమేంటి... ఆ సంఘటన తర్వాత ఇద్దరి మధ్య...

2015 నుంచి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు సంబంధించి ‘ మౌకా మౌకా’ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీల్లో ఇది వరకు దాయాది జట్లుపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో భారత్ కు అనుకూలంగా పాక్ కు వ్యంగ్యంగా ఆ అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి. అయితే.. ఇప్ప్ుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో టీమిండియా.. పాక్ చేతిలో ఓడిన నేపథ్యంలో అక్తర్ ఆ యాడ్ పై తనదైన శైలిలో స్పందించాడు.

‘మేం టీమిండియాతో ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ మరోసారి ఓడించాలని ఉంది. అది జరగాలని మేం కోరుకుంటున్నాం. ఫైనల్స్ లో టీమిండియా మరో మౌకా( అవకాశం) ఇవ్వాలని చూస్తున్నాం. ఇక్కడ నేను మౌకా అని పేర్కొనడానికి ఒక కారణనం ఉంది. ఎందుకంటే ఆ పదం ఇప్పుడు  పాకిస్తాన్ ను అపహాస్యం చేసేది కాదు. మామూలుగా ఒక అడ్వర్టైజ్మెంట్ రూపొందించడం, అది సరదాగా ఉండటం తప్పేమీ కాదు. కానీ.. ఒక దేశాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ కాదు’ అని అక్తర్ పేర్కొన్నాడు.

అలాగే గత రాత్రి టీమిండియా.. ఆప్గానిస్తాన్ పై గెలుపొందడంతో.. చాలా మంది పాక్ అభిమానులు.. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని పేర్కొంటూ. సోషల్ మీడవియాలో పోస్టులుపెడుతున్నారు. దీనిపై స్పందించిన అక్తర్ .. ఇందులోఅనవసరంగా ఆప్గానిస్తాన్ ను నిందించరాదని కోరాడు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఇలా వ్యాఖ్యానించడం పట్ల ఆ జట్టుకు ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. ఆప్గాన్ బలమైన జట్టు కాదని. ఈ మ్యాచ్ లో బలమైన టీమిండియాతో పోటీపడిందని అభిప్రాయపడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios