పాకిస్తాన్- జింబాబ్వే మధ్యలో ‘మిస్టర్ బీన్’ గొడవ... ఫేక్ ‘పాక్ బీన్’ని ఇచ్చి, మోసం చేసిన పాక్...
జింబాబ్వేకి పాక్ ఫేక్ మిస్టర్ బీన్‌ని పంపిన పాకిస్తాన్.. ఫేక్ మిస్టర్ బీన్‌కి జింబాబ్వేలో రాచ మర్యాదలు, జనాల నుంచి డబ్బులు వసూలు చేసి...
‘మిస్టర్ బీన్’ ఇంగ్లీష్ కామెడీ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎవ్వరినీ నొప్పించకుండా, పెద్దగా డైలాగులు కూడా చెప్పకుండా కేవలం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ నవ్విస్తున్నాడు మిస్టర్ బీన్. ఇప్పుడు పాకిస్తాన్,జింబాబ్వే మధ్యలో ‘మిస్టర్ బీన్’ గురించి గొడవ జరుగుతోంది... ఇంగ్లీష్ నటుడు, రచయిత రోవన్ అట్కీసన్, ‘మిస్టర్ బీన్’ కామెడీ సిరీస్ ద్వారా పిల్లల్లో, పెద్దల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. చార్లీ చాప్లిన్ మాదిరిగా చాలామంది మిస్టర్ బీన్‌లా వేషాలు వేసుకుని, జనాలను నవ్వించే ప్రయత్నం కూడా చేస్తుంటారు..
అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య మ్యాచ్‌కి ముందు ‘మిస్టర్ బీన్’ గురించి సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. ఇంతకీ విషయం ఏంటంటే...‘మిస్టర్ బీన్’ రోవన్ అట్కీసన్‌కి జింబాబ్వేలో బీభత్సమైన క్రేజ్ ఉంది... దీన్ని పాక్ మరోలా వాడడమే! పాక్ క్రికెట్ బోర్డు, జింబాబ్వేతో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నామంటూ ప్రాక్టీస్ సెషన్స్‌లోని ఫోటోలను ట్విట్టర్‌లో ఫోటో చేసింది.
దీనికి ఓ జింబాబ్వే నెటిజన్ స్పందించిన తీరు, హాట్ టాపిక్ అయ్యింది... ‘జింబాబ్వే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ క్షమించరు. మిస్టర్ బీన్ రోవన్ అని చెప్పి, ఓ మోసగాడు పాక్ బీన్‌ని పంపించారు. మేం దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం. వాన రావాలని కోరుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు ఓ జింబాబ్వే జాతీయుడు...
‘ఏం జరిగిందని’ ఓ పాక్ నెటిజన్ ఆసక్తిగా ప్రశ్నించాడు. ‘మిస్టర్ బీన్ రోవన్‌ని పంపిస్తామని చెప్పి, ఓ నకిలీ మోసగాడిని పంపించారు...’ అంటూ రిప్లై ఇచ్చాడు జింబాబ్వే నెటిజన్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
ఓవరాక్షన్ చేస్తూ మూతీతో వెకిలి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే ఈ ‘ఫేక్ పాక్ బీన్’, 12 ఏళ్ల క్రితం అప్పటి పాక్ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీతో కలిసి ఓ యాడ్‌లో కూడా నటించడం విశేషం. పాక్ పంపిన నకిలీ మిస్టర్ బీన్‌కి జింబాబ్వే ప్రభుత్వం అధికారిక భద్రతా ఏర్పాట్లు చేసి వీధుల్లో ఊరేగించింది. వీడే అసలైన మిస్టర్ బీన్ అనుకుని, రాచ మర్యాదలతో సత్కరించింది. సన్మాన కార్యక్రమాలు నిర్వహించింది.
జింబాబ్వే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేస్తున్న ఆ పాక్ ఫేక్ బీన్, అక్కడ జనాల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేశాడట. కోట్ల రూపాయలతో దేశం దాటాడని సమాచారం. ఇప్పుడు ఈ ఫేక్ బీన్ గురించి ట్విట్టర్‌లో రచ్చ జరుగుతోంది...