Asianet News TeluguAsianet News Telugu

అంపైర్ పై దౌర్జన్యానికి దిగిన పాకిస్తాన్ పేసర్.. ఔటివ్వనందుకు చేతి వేలును బలవంతంగా పైకెత్తుతూ...

Hasan Ali: పాకిస్తాన్  పేసర్ హసన్ అలీ అంపైర్  పై దౌర్జన్యానిని దిగాడు. అతడు అప్పీల్ చేసిన  ఎల్బీడబ్ల్యూను అంపైర్ ఔటివ్వకపోవడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. 

Pakistan Pacer Hasan Ali Tries To Raise Umpires Finger For LBW Appeal, Video Went Viral in Social Media
Author
India, First Published Jun 30, 2022, 12:07 PM IST

పాకిస్తాన్  పేసర్ హసన్ అలీ ఆప్ ఫీల్డ్ తో పాటు ఆన్ ఫీల్డ్ లో కూడా చాలా జోవియల్ గా ఉంటాడు. తన అభిమానుల కోసం ఫీల్డ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంటర్ టైన్ చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు రావల్పిండి వేదికగా జరిగిన ఓ మ్యాచ్ లో అంపైర్ దగ్గరికి వెళ్లి బిగ్గరగా అప్పీల్ చేయడమే గాక అతడు ఔటివ్వకపోవడంతో సదరు అంపైర్ వేలును బలవంతంగా పైకెత్తాడు.

త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్..  అంతకుముందే రావల్పిండిలో ఏర్పాటు చేసిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో పాల్గొన్నది.  అయితే ఈ మ్యాచ్ లో హసన్ అలీ..  ప్రత్యర్థి బ్యాటర్ అగ సల్మాన్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు.  

కానీ అంపైర్ మాత్రం ఈ అప్పీల్ ను నిరాకరించాడు. దాంతో హసన్ అలీ అంపైర్ దగ్గరికెళ్లి.. బలవంతంగా అతడి చేతి వేలిని పైకెత్తి ఔట్.. ఔట్ ఇచ్చాడు. ఈ ఘటన అంపైర్ తో పాటు ఆటగాళ్లలో కూడా నవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇలా కూడా బ్యాటర్లను ఔట్ చేయొచ్చా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లు కష్టపడటం కంటే  ఈ పద్ధతేదో బాగుందని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.  

 

లంక పర్యటనకు పాక్.. 

జులై 16 నుంచి లంకతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం  పాకిస్తాన్ జట్టు త్వరలోనే శ్రీలంకకు పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా లంకతో పాక్.. రెండు టెస్టులు ఆడనుంది. జులై 16-20 మధ్య తొలి టెస్టు, జులై 24-28 వరకు రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టును గాలేలో నిర్వహిస్తుండగా రెండో టెస్టు కొలంబోలో జరుగుతుంది. ఇక ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఇప్పటికే 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

లంక పర్యటనకు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫిక్, అజర్ అలీ, ఫహీమ్ అష్రఫ్, ఫావద్ ఆలం, హరిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, నౌమన్ అలీ, సల్మాన్ అలి అగ, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, షాన్ మసూద్, యాసిర్ షా 
 

Follow Us:
Download App:
  • android
  • ios