Asianet News TeluguAsianet News Telugu

Hasan Ali: పీసీబీ నిన్ను ఆపకపోవచ్చు.. కానీ మాకా దమ్ముంది.. అందరిముందు జర్నలిస్ట్ పై ఫైర్ అయిన పాకిస్థాన్ పేసర్

Hasan Ali Hated Argument With Journalist: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2021 ప్రారంభం సందర్భంగా హసన్ అలీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్స్ మీడియా  సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హసన్ అలీ.. అక్కడున్న జర్నలిస్టుపై ఫైర్ అయ్యాడు. 

Pakistan Pacer Hasan Ali gets engaged in a heated argument with a journalist
Author
Hyderabad, First Published Dec 13, 2021, 1:47 PM IST

పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ గుర్తున్నాడు కదా.. అదేనండి, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా  వికెట్ కీపర్ మాథ్యూవేడ్ ఇచ్చిన  క్యాచ్ నేలపాలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బౌలర్.  ఆ తర్వాత పాక్ అభిమానులు అతడితో పాటు హసన్ అలీ భార్యను కూడా టార్గెట్ గా చేసుకున్నారు. ఇక తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి క్యాచులేమీ మిస్ చేయలేదు. దారుణమైన బౌలింగ్ స్పెల్ కూడా నమోదు చేయలేదు. కానీ తనను ప్రశ్నలడగి విసిగించిన జర్నలిస్టు మాత్రం అసమనం వ్యక్తం చేశాడు. అతడితో ఏకంగా.. ‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిన్ను ఆపకపోవచ్చు.. కానీ  మేము నిన్ను ఆపుతాం..’ అంటూ ఫైర్ అయ్యాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2021 ప్రారంభం సందర్భంగా హసన్ అలీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్స్ మీడియా  సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హసన్ అలీతో పాటు ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ ప్రతినిధి విలేకరులతో మాట్లాడుతున్నారు.

 

ఈ క్రమంలో ఓ జర్నలిస్టు లేచి హసన్ అలీని ఓ ప్రశ్న అడుగుతుండగా అతడు మధ్యలో కల్పించుకుని.. ‘తర్వాత ప్రశ్న ప్లీజ్...’ అని అన్నాడు. దానికి సదరు రిపోర్టర్ కూడా నా ప్రశ్న ఇంకా పూర్తి  కాలేదని  చెప్పినా  హసన్ అలీ వినిపించుకోలేదు. మళ్లీ అదే సమాధానం.. ‘నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్..’ నాలుగు సార్లు ఇలాగే అనేసరికి చిర్రెత్తుకొచ్చిన ఆ జర్నలిస్ట్.. ‘ఇది మంచి పద్ధతి కాదు..’ అని హెచ్చరించాడు. 

దానికి హసన్ అలీ స్పందిస్తూ.. ‘ముందు నువ్వు ట్విట్టర్ లో మంచి విషయాలు పోస్ట్ చెయ్యి.. ఆ తర్వాత నేను మంచి సమాధానాలు చెబుతా. ఓకేనా..? నువ్వు ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవద్దు..’ అని చెబుతూనే.. ‘ప్రశ్నలు అడగటానికి నిన్ను పీసీబీ ఆపలేకపోవచ్చు. కానీ మాకు ఆ హక్కుంది..’ అని  ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

అయితే సదరు రిపోర్టర్ తో  హసన్ అలీ వైరం ఇప్పటిదికాదని తెలుస్తున్నది. ఈ ఏడాది మేలో హసన్ అలీ కి సంబంధించిన ఓ వీడియో ను అనాస్ సయీద్ (మీడియా సమావేశంలో హసన్ అలీ అసహనం వ్యక్తం చేసిన రిపోర్టర్ పేరు) ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కరోనా మార్గదర్శకాలను పాటించడం లేదంటూ  పేర్కొంటూ ట్విట్టర్ లో ఆ వీడియోను ఉంచాడు. దీనిపై గతంలో హసన్ అలీ విమర్శలకు గురయ్యాడు.  ఇక తాజాగా ఆ వీడియో నేపథ్యంలో హసన్ అలీ అనాస్ పై బదులు తీర్చుకున్నాడని పాక్ లో అభిమానులు వాపోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios