ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకుని, పవిత్రమైన పిల్లలు పుట్టాలంటే ఎలా? అబ్దుల్ రజాక్ షాకింగ్ కామెంట్స్..
ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు..
పాకిస్తాన్ క్రికెట్ టీమ్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 9 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న పాకిస్తాన్, 5 మ్యాచుల్లో ఓడింది. అందులో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో దక్కిన గెలుపు, పూర్తిగా లక్కీగా వచ్చిందే. ఈ ఫెయిల్యూర్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి చేసిన వ్యాఖ్యల్ల భారత నటి ఐశ్వర్య రాయ్ ప్రస్తావన తెచ్చి, వివాదాల్లో ఇరుక్కున్నాడు పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్..
‘యూనిస్ ఖాన్, కెప్టెన్‌గా చాలా మంచి లక్ష్యాలను నిర్ణయించుకున్నాడు. నేను బాగా రాణించడానికి అతను ఇచ్చిన కాన్ఫిడెన్స్ కూడా ఓ కారణం. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ప్రతీ ప్లేయర్‌కి ఓ లక్ష్యం ఉండేది. అయితే పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని పటిష్టంగా చేయాలనే ఆలోచన మాత్రం ఎవ్వరికీ రాలేదు...
ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు అవుతుంది. అది ఎప్పటికీ జరగదు..’ అంటూ వ్యాఖ్యానించాడు అబ్దుల్ రజాక్. రజాక్ పక్కనే కూర్చున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహీద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్... ఈ వ్యాఖ్యలకు నవ్వుతూ చప్పట్లు కొట్టారు..
పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి సరైన గైడెన్స్ లేదని చెప్పేందుకు, ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడంపై భారతీయులు మండి పడుతున్నారు. తరాలు మారుతున్నా పాకిస్తాన్ క్రికెటర్లు బుద్ధి మార్చుకోవడం లేదని పోస్టులు చేస్తున్నారు. ఆఖరికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయినా ఓ భారతీయ నటిని అవమానించేలా మాట్లాడి, దృష్టి మరల్చాలని చూడడం కంటే నీచమైన పని మరేదీ ఉండదని, అబ్దుల్ రజాక్ బేషరతుగా ఐశ్వర్య రాయ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు.