అధికారికంగా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ అవుట్... సెమీస్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్...
నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్.. నవంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రీ- క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నెట్ రన్ రేట్‌ని అందుకోలేకపోవడంతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 337 పరుగుల భారీ స్కోరు చేసింది. సెమీ ఫైనల్ రేసులో ఉండాలంటే ఈ టార్గెట్‌ని 6.3 ఓవర్లలోనే ఛేదించాల్సింది. మొదటి 10 ఓవర్లు ముగిసే సమయానికి 43 పరుగులే చేసిన పాకిస్తాన్, 2 వికెట్లు కోల్పోయింది. దీంతో సెమీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది..
దీంతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, అధికారికంగా సెమీ ఫైనల్ చేరింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాతి రోజు నవంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది.
సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు, ఫైనల్ చేరుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది..
2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలైంది. ఈసారి కూడా టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన టీమిండియా, న్యూజిలాండ్‌తోనే సెమీస్ ఆడనుంది. గత ప్రపంచ కప్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైన భారత జట్టు, ఈసారి రివెంజ్ కోసం ఎదురుచూస్తోంది..