ప్రపంచంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓ పేరుంది. ఆ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. మహా మహా జట్లను మట్టికరిపించే ఆ జట్టు.. పసికూనల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ప్రపంచంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓ పేరుంది. ఆ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. మహా మహా జట్లను మట్టికరిపించే ఆ జట్టు.. పసికూనల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

క్రికెటర్లు సైతం ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో యువ ఆటగాడు షాహీన్ ఆఫ్రిది రనౌటైన తీరు పాక్ జట్టులో అనిశ్చితిని మరోసారి తెరపైకి తెచ్చింది.

షాహిన్ తనకు తానుగా రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా 75 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది ఉన్నారు.

ఈ క్రమంలో క్రిస్ వోక్స్ వేసిన బంతి రిజ్వాన్ లెగ్‌ను తాకుతూ బయటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అప్పీల్ కోసం అంపైర్‌ను అడుగుతున్నారు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్ కాల్ వినిపించుకోకుండానే షాహిన్ పరుగు కోసం సగం క్రీజును వదిలి వచ్చేశాడు.

సరిగ్గా ఇదే సమయంలో బంతిని అందుకున్న డొమినిక్ మెరుపు వేగంతో విసిరిన డైరెక్ట్ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. అనవసరంగా ఒక డాట్ బాల్‌కు అవుటయ్యాననే ఫీలింగ్‌ వచ్చిందేమో... కానీ పెవిలియన్‌కు వెళ్లేటప్పుడు షాహిన్ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రనౌట్ వైరల్‌గా మారింది. కాగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. పాక్ వరుస చూస్తుంటే ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా సిరీస్ సమర్పించుకునేట్లే కనిపిస్తోంది. 


Scroll to load tweet…