వన్డేల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఎదుర్కొన్న మూడో బంతికే ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.

శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా ఆయన ఘనత సాధించాడు. బాబర్ ఇప్పటి వరకు 100 వన్డేలు ఆడగా.. అతనిని ఇప్పటి వరకు ఏ స్పిన్నర్ డకౌట్ చేసింది లేదు. దీంతో ముజీబ్ ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఎదుర్కొన్న మూడో బంతికే ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. అయితే దురదృష్టవశాత్తూ రివ్యూకి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫజల్ హాక్ ఫారూకీ బౌలింగ్‌లో ఓపెనర్ ఫకర్ జమాన్ (2) ఔట్ అయ్యాడు. ఇక ముజీబ్ వేసిన సెకండ్ ఓవర్‌లో బాబర్ ఆజమ్ డకౌట్ అయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను అందుకున్నాడు. 21 పరుగుల వద్ద అతనిని ముజీబ్, అఘా సల్మాన్ (7)ను రషీద్ ఖౌన్ ఔట్ చేశారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అప్పటికి క్రీజులో ఇమామ్ ఉల్ హాక్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (23) వున్నారు. 

ఇదిలావుండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 101 మ్యాచ్‌లు ఆడగా ఇందులో 18 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు వున్నాయి. మొత్తం పరుగులు 5089 . ఈ మ్యాచ్ కంటే ముందు బాబర్ ఆజం 18 వన్డేల్లో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో వున్నాడు. 

Scroll to load tweet…