BPL: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో భాగంగా నసీమ్ షా.. తన సహచర క్రికెటర్ ను బాడీ షేమింగ్ చేశాడు. అతడు చేసిన ఈ పనికి   సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్తాన్ యువ క్రికెటర్ నసీమ్ షా వివాదంలో చిక్కుకున్నాడు. తన సహచర క్రికెటర్ అని కూడా చూడకుండా బాడీ షేమింగ్ కు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో భాగంగా నసీమ్ షా చేసిన ఈ పనికి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ కాస్త గౌరవంగా ఉండాలని, ఇంకా పిల్లాడి వేషాలు వేస్తామంటే కుదరదని నెటిజన్లు వాపోతున్నారు. 

వివరాల్లోకెళ్తే.. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం రాత్రి ఖుల్నా టైగర్స్ వర్సెస్ కొమిలా విక్టోరియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా ఖుల్నా టైగర్స్ బ్యాటర్ అజమ్ ఖాన్ (పాకిస్తాన్) బ్యాటింగ్ చేస్తుండగా పాక్ కే చెందిన యువ పేసర్ నసీమ్ షా.. 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. 

తొలి బంతిని వేయడానికి ముందే నసీమ్ షా.. అజమ్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అజమ్.. నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్దకు రాగా నసీమ్.. అతడిని ఆటపట్టించాడు. అతడికి ఎదురుగా వెళ్లి అజమ్ ను ఏదో అనబోయాడు. కానీ అజమ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అతడిని తోసేయడానికి యత్నించాడు. అయితే నసీమ్ అక్కడితో ఆగకుండా అజమ్ వెనకాల అతడిని వెక్కిరిస్తూ నడుస్తూ వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

వీడియో చూసిన నెటిజన్లు నసీమ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. నసీమ్ షాలో ఇంకా పిల్లాడి చేష్టలు పోలేదని.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నా ఈ తలతిక్క పనులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్న బౌలర్.. తన తోటి క్రికెటర్ ను గౌరవించకున్నా ఇలా బాడీ షేమింగ్ చేయడం మంచిది కాదని వాపోతున్నారు. 

Scroll to load tweet…


Scroll to load tweet…