ఆస్ట్రేలియా టూర్‌లో సుదీర్ఘ సిరీస్ ఆడబోతున్న భారత జట్టు... రేపు ఒకే రెండు మ్యాచులు ఆడబోతోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు రెండో టీ20 మ్యాచ్ ఆడబోతుంటే... టెస్టు ప్లేయర్లతో కూడిన జట్టుతో ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.

టెస్టులు ఆడుతున్న ప్లేయర్లతో చాలామంది టీ20 జట్టుకి దూరంగా ఉన్నారు. ఇండియా ఏ జట్టులో వీరంతా రేపు బరిలో దిగబోతున్నారు. పృథ్వీషా, శుబ్‌మన్ గిల్, అజింకా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ భారత ఏ జట్టులో ఉండబోతున్నారు.

మూడు రోజుల ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను సోనీ సిక్స్ ఛానెల్‌లో లైవ్ రాబోతుంది. మొదటి టీ20 గెలిచిన టీమిండియా, రేపు సిడ్నీలో జరిగే రెండో టీ20 మ్యాచ్ కూడా సిరీస్ సొంతం చేసుకోవాలనే ఆతృతగా ఉంది. అయితే గత రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా లేకుండా మిగిలిన రెండు టీ20లను ఆడనుంది టీమిండియా.