Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాలో ఉమ్రాన్ కి చోటు... ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్..!

ఇటీవల 157 కిమీ వేగంత ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సాధించి.. ఐపీఎల్ లో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించాడు.

On Umran Malik's Maiden India Call-Up, Omar Abdullah Tweets This
Author
Hyderabad, First Published May 23, 2022, 10:09 AM IST

సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో సత్తా చాటాడు. కాగా.. ఆయన ఆట తీరుకు ప్రతి ఫలంగా.. తొలిసారి టీమిండియాలో చోటు దక్కించకున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. కాగా... దక్షిణాఫ్రికాతో  జరిగే ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ కి.. ఉమ్రాన్ ఖాన్ ని ఎంపిక చేశారు.  గత సీజన్ లో సన్ రైజర్స్ రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో ఉమ్రాన్ ఖాన్ కూడా ఒకరు కావడం గమనార్హం.

తన మొదటి సీజన్  లో అతను 21 వికెట్లు తీసి అందరినీ ఆకర్షించాడు. అతను తన పేస్ తో చాలా మంది టాప్ క్లాస్  బ్యాట్స్ మెన్ లను ఔట్ చేశాడు. ఇటీవల 157 కిమీ వేగంత ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సాధించి.. ఐపీఎల్ లో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సాధించాడు.

 

కాగా.. సన్ రైజర్స్ కుర్రాడు.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన వాడు. అందుకే.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,  నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా  స్పందించాడు. ఉమ్రాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాలో చోటు దక్కించుకోవడం పై  ఉమ్రాన్ కి అభినందనలు తెలియజేశాడు.
ఈ 22 ఏళ్ల యువకుడిని అభినందించాడు.అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను "చాలా ఆసక్తిగా" అనుసరిస్తానని చెప్పాడు. 

ఉమ్రాన్ తొలిసారి టీమిండియాకు సెలక్ట్ కావడం ఆనందంగా ఉందని.. ఆ సీరిస్ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.

 కాగా.. ఉమ్రాన్ తో పాటు అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు. పొట్టి ఫార్మాట్ లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చారు. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ సిరీస్ లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.


ఈ టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్‌ 9న ఢిల్లీ, 12న కటక్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఈ సిరీస్ లో 14వ తేదీన జరిగే మూడో మ్యాచ్ కు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios