బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ తల్లికాబోతున్నారు. మరి కొద్ది నెలల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. కాగా.. తల్లి కాబోతున్న ఆనందాన్ని ఆమె పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.  ఈ మేరకు తన గర్భాన్ని చూసుకొని మురిసిపోతున్న ఓ ఫోటోని తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటోకి కోహ్లీ చేసిన కామెంట్ ఇప్పుడు అదిరిపోయింది.

 

ఇంతకీ మ్యాటరేంటంటే.. అనుష్క శర్మ తన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి ఓ అందమైన క్యాప్షన్ కూడా జత చేశారు. ‘ నీలో మరో జీవం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడం కంటే నిజమైన, మధురమైన ఆనందం మరొకటి ఉండదు’ అంటూ ఆమె పేర్కొనగా.. ఆ పోస్టుకి కోహ్లీ స్పందించారు. ‘ నా ప్రపంచం మొత్తం ఒకే ఒక్క ఫ్రేమ్ లో ఉంది’ అంటూ హార్ట్ సింబల్ తో కోహ్లీ కామెంట్ చేశారు. కాగా.. భార్య, కాబోయే బిడ్డపై కోహ్లీ కేవలం ఒకే ఒక్క మాటలో తన ప్రేమను చూపించడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఆయన కామెంట్ కి కూడా లైకుల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కోహ్లీ.. ఐపీఎల్ కోసం దుబాయిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అనుష్క, విరాట్ లు 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.