టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా.. నిన్న తన 27వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అయితే.. ఐపీఎల్ కారణంగా.. భార్య, కొడుకు లేకుండానే పుట్టినరోజు జరుపుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ 2020 జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అన్ని జట్లు అక్కడ తలపడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ బాగానే దూసుకుపోతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లోనూ ముంబయిదే విజయం.  కాగా.. పుట్టిన రోజు నాడు కూడా హార్దిక్.. స్టేడియంలోనే గడపాల్సి వచ్చింది.

అయితే.. హార్దిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. తనతో పాండ్యా గడిపిన క్షణాలను ఫోటోలతో తెలియజేశారు. వారి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అగస్త్య( హార్దిక్-నటాషాల కుమారుడు) తమ జీవితంలో వచ్చేంత వరకు అన్ని రకాల ఫోటోలను నటాషా షేర్ చేశారు. ఆ ఫోటోలను గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదు. నటాషా కడుపుతో ఉన్నప్పుడు.. పాండ్యా ఆమె పట్ల తీసుకున్న ప్రేమ, శ్రద్ధ కూడా ఆ ఫోటల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ తర్వాత వారి జీవితంలోకి కుమారుడు వచ్చాక.. ఆ చిన్ని పాండ్యాతో.. హార్దిక్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా నటాషా షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ ఫోటోలకు ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘‘ నా ఫేవరేట్, నా బెస్ట్  ఫ్రెండ్, మైలవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా జీవితంలోకి సంతోషం, ఆనందం తీసుకువచ్చావు. నీతో గడిపిన ప్రతి క్షణం అద్భుతం. అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. భవిష్యత్తులో మరెన్నో ఆనందకరమైన రోజులు నీతో గడపాలని కోరుకుంటున్నాను. అగస్త్య కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నాడు. త్వరగా వచ్చేసి మాతో నువ్వు సమయం గడపాలని కోరుకుంటున్నాను. నువ్వ బెస్ట్’’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు. 

కాగా.. గతేడాది డిసెంబర్ లో హార్దిక్.. నటాషాకి ప్రపోజ్ చేశారు. తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ప్రకటించారు. లాక్ డౌన్ లో వారి పెళ్లి జరిగిపోగా.. జులైలో వారికి కుమారుడు జన్మించాడు. వారి కుమారుడికి అగస్త్య అని నామకరణం చేశారు.