ఇంగ్లాండ్ సీనియర్ క్రికెట్ మైకేల్ వాన్ సోషల్ మీడియాలో  చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు క్రికెట్ గురించి తన అభిప్రాయాలను ఆయన షేర్ చేస్తూనే ఉంటారు. ఆ మధ్య అహ్మదాబాద్ పిచ్ పై విమర్శలు చేసి.. ఇండియన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత టీమిండియా పై ప్రశంసలు కూడా కురిపించాడు. 

కాగా.. తాజాగా.. క్రికెట్ కి సంబంధించి ఓ హిలేరియస్ వీడియోని ఆయన షేర్ చేశాడు. ఆ వీడియో చూసి నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ప్రాపర్ క్రికెట్ అంటే ఇదే అంటూ... ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.

 

అందులో...  ఫీల్డింగ్ సరిగా లేదు. బ్యాట్స్ మెన్ లు ఇద్దరూ పరుగులు చేస్తూనే ఉన్నారు. బౌలర్లు మాత్రం.. ఆ బాల్ తీసుకురాలేక తిప్పలు పడుతూనే ఉన్నారు. దీంతో.. ఈ వీడియోని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని ఓ అభిమాని మైకెల్ కి షేర్ చేయగా... ఆ వీడియో ని ఆయన కూడా అభిమానులతో పంచుకున్నారు. కావాలంటే.. ఆ వీడియోని మీరు కూడా చూడొచ్చు.