Asianet News TeluguAsianet News Telugu

Novak Djokovic: జొకోవిచ్ అరెస్ట్..? కోర్టు ఊరటనిచ్చినా వదలని పోలీసులు.. జొకో తండ్రి సంచలన ఆరోపణలు

Novak Djokovic arrested:  వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్, సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ కు మళ్లీ ఎదురుదెబ్బ..?  న్యాయస్థానంలో అతడికి అనుకూల తీర్పు వచ్చినా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం అతడిని వదలడం లేదు. 

Novak Djokovic Father Claims His Son reportedly Arrested by Melbourne Police After Court Rules Favor To Serbian Tennis Star
Author
Hyderabad, First Published Jan 10, 2022, 4:28 PM IST

ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వీసాకు సంబంధించి వివాదంలో ఎదుర్కున్న  ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ కు మరో షాక్ తగిలింది. వీసా విషయంలో అతడికి స్థానిక కోర్టు ఊరటనిచ్చినా మెల్బోర్న్ పోలీసులు మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. పోలీసులు జొకోవిచ్ ను అదుపులోకి తీసుకున్నట్టు అతడి తండ్రి ఆరోపించాడు.  భారీగా పోలీసు బలగం వచ్చి తన కొడుకును ఇమిగ్రేషన్ వ్యాన్ లో తీసుకెళ్లారని ఆయన మీడియాతో అన్నారు. 

సెర్బియా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘నా  కుమారుడి లాయర్ ఆఫీస్ వద్ద భారత సంఖ్యలో పోలీసులు వచ్చి జొకోవిచ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు..’ అని ఆరోపించాడు. ఇదిలాఉండగా.. మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం తాము  జొకోను అరెస్టు చేయలేదని చెబుతుండటం గమనార్హం. 

 

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు మెల్బోర్న్ కు వచ్చిన జొకోవిచ్ ను  అక్కడి విమాన అధికారులు అడ్డుకున్నారు. వ్యాక్సినేషన్ మినహాయింపు  సర్టిఫికెట్లను జొకో చూపించినా దానికి  ఆసీస్ ప్రభుత్వం సంతృప్తి చెందలేదు.  జొకోవిచ్ తెచ్చిన వ్యాక్సినేషన్ మినహాయింపు కారణాలు సరిగా లేవని, అతడు క్వారంటైన్ పీరియడ్ ను పూర్తి చేయకుంటే దేశంలోకి అనుమతించబోమని  కరాఖండిగా చెప్పారు. దీంతోపాటు జొకో వీసా రద్దు  చేస్తూ ఆస్ట్రేలియా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు  కోర్టు మెట్లెక్కాడు. 

జొకోవిచ్  వాదనలు విన్న టెన్నిస్  ఫెడరల్  సర్క్యూట్ తో పాటు ఆస్ట్రేలియాన్ ఫ్యామిటీ కోర్టు.. అతడికి దేశంలోకి రావడానికి అనుమతినిచ్చింది. న్యాయస్థానంలో అతడికి అనుకూలంగా తీర్పు రావడంతో జొకో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు  మార్గం సుగమమైంది. 

 

వివాదం ముగిసిందనుకునే లోపే మళ్లీ టీవీలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టెన్నిస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, సెర్బియా కు చెందిన కొన్ని ఛానెళ్లు.. జొకోవిచ్ ను అరెస్టు చేశారంటూ బ్రేకింగ్ న్యూస్ లు  ప్రసారం చేస్తున్నాయి. అయితే దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం గానీ, జొకో తరఫు న్యాయవాది గానీ  అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 

ఇక ఇదే విషయమై జొకోవిచ్ సోదరుడు జార్జ్ జొకోవిచ్ స్పందిస్తూ.. ‘నొవాక్ ను మళ్లీ లాక్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తున్నది. మేము ప్రస్తుతం తదుపరి తీసుకోవాల్సిన దశల  గురించి సంబంధిత వ్యక్తులు, అధికారులతో మాట్లాడుతున్నాం...’ అని తెలిపాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios