Asianet News TeluguAsianet News Telugu

నిరాశే మిగిలింది: క్రికెట్ కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వీడ్కోలు

దక్షిణాఫ్రికా తరపున అతను 64టెస్టులు, 30 వన్డేలు, 7టీ20లు ఆడాడు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, టీ20 ఫార్మాట్లో నాలుగు వికెట్లు తీశాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మార్కెల్ తోపాటు దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బౌలర్ గా సేవలు అందించాడు. 

Not the way I wanted to end it: Retiring pacer Vernon Philander rues series loss vs England
Author
Hyderabad, First Published Jan 28, 2020, 10:41 AM IST


దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ తో  జరిగిన నాలుగో టెస్టు ముగిసిన అంనతంర అతను క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం వీడ్కోలు పలుకుతానని అతను గతంలోనే ప్రకటించాడు.

Also Read ట్రిపుల్ సెంచరీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ మరో ఫీట్...

దక్షిణాఫ్రికా తరపున అతను 64టెస్టులు, 30 వన్డేలు, 7టీ20లు ఆడాడు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, టీ20 ఫార్మాట్లో నాలుగు వికెట్లు తీశాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మార్కెల్ తోపాటు దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బౌలర్ గా సేవలు అందించాడు. తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటిన ఘనత ఫిలాండర్ కే దక్కుతుంది.

అయితే... ఆఖరి టెస్టు మ్యాచ్ ఫిలాండర్ కు పెద్దగా కలిసిరాలేదు. జట్టును గెలిపించి వీడ్కోలు పలకాలని అతను అనుకున్నప్పటికీ.. ఆ కల నెరవేరలేదు. అంతేకాకుండా ఐసీసీ తన మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించడంతో పాటు ఒక అయోగ్యత పాయింటను ఇచ్చింది. నాలుగో టెస్టు రెండో రోజు జోస్ బట్లర్ ణు ఔట్ చేసిన అనంతరం అతడు హద్దు మీరి ప్రవర్తించినందుకు ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

కాగా.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఓటమి తర్వాత ఫిలాండర్ మాట్లాడుతూ... ఆ విదంగా తాను కెరీర్ ను ముగించాలని అనుకోలేదని, అది మానవుడి చేతిలో లేదని, ఇంగ్లాండు అద్భుతంగా ఆడిందని, తాము తీవ్రంగా శ్రమించామని, దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు అవకాశం రావడం  తనకు గౌరవమని అన్నాడు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios