Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా..? సచిన్, ధోని, కోహ్లీలు కూడా అతడి తర్వాతే..

World Richest Cricketer: క్రికెట్, క్రికెటేతర ఆదాయం ద్వారా  క్రికెటర్లు వందల కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. తాజాగా  ఓ సంస్థ..  ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన  టాప్-10 క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది.  

Not Sachin Tendulkar or Virat kohli, meet World Richest Cricketer Here MSV
Author
First Published Mar 15, 2023, 7:43 PM IST | Last Updated Mar 15, 2023, 8:16 PM IST

భారత్ లోనే గాక ప్రపంచంలోని పలు దేశాల్లో క్రికెట్ కు భారీ క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్,  టెన్నిస్ మాదిరిగా విరివిగా దేశాలు ఈ  ఆటలో పాల్గొనకపోయినా  ఆటగాళ్లకు మాత్రం  ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఉంది.  ఇక ఇండియాలో అయితే  క్రికెటర్లను సాక్షాత్తూ  దేవుళ్ల మాదిరే ఆరాధిస్తారు.  ఇంత క్రేజ్ ఉండటంతో   బ్రాండ్స్ (కంపెనీలు) వీళ్ల వెంట పడతాయి.   ఆట,  ఆటేతర ఆదాయం ద్వారా  క్రికెటర్లు వందల కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. తాజాగా  ఓ సంస్థ..  ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన  టాప్-10 క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది.  

ఇరవై ఏండ్ల పాటు భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా నిలిచి అభిమానుల పాలిట క్రికెట్ దేవుడిగా మారిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అయి పదేండ్లు దాటినా, భారత్ కు మూడు ఐసీసీ టోర్నీలు సాధించిన ధోని తప్పుకుని  నాలుగేండ్లు కావొస్తున్నా.. వాళ్లు ఇప్పటికీ   భారీగానే ఆర్జిస్తున్నారు. వీరికి తోడు రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  పేరు చెబితేనే ఓ బ్రాండ్. అతడు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. 

భారత క్రికెటర్లు ఇంత సంపాదిస్తున్నా వరల్డ్  రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది మాత్రం ఆస్ట్రేలియా మాజీ  వికెట్ కీపర్  ఆడమ్ గిల్‌క్రిస్ట్. ‘సీఈవో  వరల్డ్ మ్యాగజైన్’ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.  ఈ నివేదిక  ప్రకారం.. 2023లో గిల్‌క్రిస్ట్  ఆస్తి విలువ  380 యూఎస్ మిలియన్ డాలర్లు.   భారత క్రికెటర్లు   సచిన్ టెండూల్కర్ (170 యూఎస్ మిలియన్ డాలర్స్), ఎంఎస్ ధోని (115 యూఎస్ మిలియన్ డాలర్స్), కోహ్లీ  (112 యూఎస్ మిలియన్ డాలర్స్)  లు ఉన్నారు.  

 

ఈ జాబితాలో   సచిన్, ధోని, కోహ్లీతో పాటు  టాప్ - 10 లో మరో ఇద్దరు క్రికెటర్లు కూడా స్థానం సంపాదించారు. ఐదో స్థానంలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ (75 యూఎస్ మిలియన్ డాలర్స్),  దక్షిణాఫ్రికా   మాజీ ఆల్ రౌండర్ (70 యూఎస్ మిలియన్ డాలర్స్), బ్రియాన్ లారా (60  యూఎస్ మిలియన్ డాలర్స్) ల తర్వాత 8వ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ (40 యూఎస్ మిలియన్ డాలర్స్), యువరాజ్ సింగ్ (35 యూఎస్ మిలియన్ డాలర్స్) ఉన్నారు. పదో స్థానంలో  ఆసీస్ మాజీ సారథి, ప్రస్తుతం ఆ జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  స్టీవ్ స్మిత్ (30 యూఎస్ మిలియన్ డాలర్స్) ఉన్నారు.  

అభిమానులు గిల్లీ అని పిలుచుకునే గిల్‌క్రిస్ట్  తన కెరీర్ లో  96 టెస్టులు, 287 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.  టెస్టులలో 5,570, వన్డేలలో 9,619 రన్స్, టీ20లలో 272 పరుగులు చేశాడు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో    ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాటర్ గా  ఉండటమే గాక వికెట్ కీపర్ గా వికెట్ల వెనుక  తన విన్యాసాలతో     అలరించాడు.   తన కెరీర్ లో గిల్‌క్రిస్ట్ మొత్తంగా ..  905 వికెట్లు తీసిన   కీపర్ గా ఉన్నాడు. మరే వికెట్ కీపర్ కూ ఈ రికార్డు లేదు.    ఆస్ట్రేలియా 1999 తో పాటు 2003, 2007 వన్డే వరల్డ్ కప్ గెలిచిన  జట్టులో సభ్యుడు. 

క్రికెట్ నుంచి తప్పుకున్నాక  కామెంటేటర్ గా ఉంటూనే ఎఫ్45  ట్రైనింగ్ సెంటర్స్ లో ఫౌండర్ మెంబర్ గా ఉన్నాడు. ఈ సంస్థ 45 దేశాల్లో  కార్యకలాపాలు సాగిస్తోంది. ఎఫ్45కు యూఎస్ తో పాటు  కెనడా, యూకే, న్యూజిలాండ్, యూరప్ వంటి దేశాల్లో ప్రముఖ క్రీడాకారులు  బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios