టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న మాథ్యూ వేడ్ 32 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్ భారీ స్కోరు చేయడానికి మాథ్యూ వేడ్ ఇచ్చిన మెరుపు ఆరంభమే ప్రధాన కారణం. 

భారత ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేసిన మాథ్యూ వేడ్... వికెట్ల వెనకాల కొన్ని ఫన్నీ కామెంట్లు చేసి భారత క్రికెటర్లను అలరించాడు. ముఖ్యంగా శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... 9వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ స్టంపింగ్ చేయడానికి ప్రయత్నించాడు. మిచెల్ స్వీసన్‌ వేసిన వైడ్‌ బాల్‌ను అందుకున్న వైడ్, వికెట్లను గిరాటేశాడు. కానీ అంతలోపే ధావన్ క్రీజులోకి చేరుకున్నాడు.

స్టంపింగ్‌కి అప్పీలు చేసిన తర్వాత శిఖర్ ధావన్‌తో ‘నాట్ ధోనీ... నాట్ క్విక్ ఇనఫ్ లైక్ ధోనీ’ (ధోనీలా లాదు... ధోనీ అంత స్పీడ్‌గా అయితే చేయలేదు) అంటూ ధావన్‌తో కామెంట్ చేశాడు. వేడ్ వ్యాఖ్యలకు నవ్వేసిన శిఖర్ ధావన్... ‘యా... అవును’ అంటూ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.