ధోనీ.. వచ్చే ఐపీఎల్ నాటికి... జట్టు మారనున్నాడంటూ.. గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ధోనీ సైతం.. వచ్చే ఐపీఎల్ తాను చెన్నైలోనే ఉంటాననే గ్యారెంటీ లేదంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. 

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లేకుండా.. చెన్నై సూపర్ కింగ్స్ లేదని ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ( ICL) వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ లేకుండా MS Dhoni లేరని ఆయన అన్నారు. చెన్నై ఫ్రాంఛైజీకీ.. ధోనీకి మధ్య ఉన్న అనుబంధం అలాంటిదని.. ఆయన పేర్కొన్నారు.

ధోనీ న్యాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్.. IPL టైటిల్ ని నాలుగుసార్లు గెలుచుకుంది. గత సంవత్సరం కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరని సీఎస్కే.. IPL 2021 లో అదరగొట్టింది. కేకేఆర్ పై విజయం సాధించింది. నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

ధోనీ.. చెన్నైలో ఒక భాగం అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ధోనీ లేకుండా CSK, అదేవిధంగా CSK లేకుండా ధోనీ లేరని శ్రీనివాసన్ పేర్కొన్నారు. శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీతో వెంకటాచలపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధోనీ.. వచ్చే ఐపీఎల్ నాటికి... జట్టు మారనున్నాడంటూ.. గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ధోనీ సైతం.. వచ్చే ఐపీఎల్ తాను చెన్నైలోనే ఉంటాననే గ్యారెంటీ లేదంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఈ క్రమంలో అందరికీ ధోనీ సీఎస్కేని వీడనున్నాడంటూ అనుమానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని శ్రీనివాసన్ ని మీడియా ప్రశ్నించింది. దీంతో.. ఆయన చెన్నై లేకుండా ధోనీ లేడని ఆయన పేర్కొన్నారు. ధోనీ.. సీఎస్కేలోనే కొనసాగుతాడని ఆయన క్లారిటీ ఇచ్చారు. 

Also Read: టీ20 వరల్డ్‌కప్ 2021: వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... కెఎల్ రాహుల్ క్లాస్, ఇషాన్ కిషన్ మాస్

తదుపరి ఐపిఎల్ వేలంలో ధోని , ఇతర సిఎస్‌కె ఆటగాళ్లను నిలుపుకోవడం గురించి ఆయనను ప్రశ్నించగా.. దాని గురించి ఇంకా ఏమీ చర్చించలేదని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఏ క్రికెటర్ కూడా CSK జట్టులో కనిపించడం లేదనే విమర్శపై అడిగిన ప్రశ్నకు, TNPL నుండి 13 మంది ఆటగాళ్ళు IPL లో ఆడుతున్నారు ,భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పారు.

 ఇదిలా ఉండగా..ధోనీ నేతృత్వంలోని CSK గత శుక్రవారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి, ఐపీఎల్ టైటిల్‌ను నాలుగోసారి కైవసం చేసుకుంది.