హామిల్టన్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు సరదా సంఘటన చోటు చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 46వ ఓవరులో ఆ సంఘటన జరిగింది. టీమ్ సౌథీ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా కేన్ విలియమ్సన్ టోపీ గాలిలోకి ఎగిరింది. దాన్ని పట్టుకునేందుకు విలియమ్సన్ పరుగు పెట్టాడు. 

బెసిన్ రిజర్వ్ లో తీవ్రమైన గాలులు వీస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. విలియమ్సన్ సౌథీకి సూచనలు చేస్తుండగా టోపీ గాలిలోకి లేచింది. దాన్ని ఒడిసిపట్టుకునేందుకు విలియమ్సన్ దాని వెంట పడ్డాడు. అయితే, టోపీ అత్యంత వేగంగా దూసుకుపోతూ బౌండరీ దాటింది. 

తాను ఫీల్డింగ్ చేస్తున్న చోటు నుంచి విలియమ్సన్ 30 గజాల దూరం పరుగెత్తి దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. దీంతో మైదానంలో నవ్వుల పువ్వులు పూశాయి. వ్యాఖ్యాతలు, ప్రేక్షకులు, ఆటగాళ్లు నవ్వులు చిందించారు .ఇది కెమెరాలకు చిక్కింది. 

తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 165 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్సులో ఆలవుటై భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది.