9 జట్లు 100 పరుగులు కూడా చేయలేకపోయాయి.. ఇదేం వరల్డ్ కప్ మావా.. !
T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో బ్యాట్ హిట్టింగ్ కనిపించలేదు. బాల్ మాయ కనిపించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక వంటి జట్లు లీగ్ దశ నుంచే ఎలిమినేట్ అయ్యాయి. ఇదేం వరల్డ్ కప్ అనుకునేలా అనేక చెత్త రికార్డులు కూడా నమోదయ్యాయి.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో లీగ్ దశ మ్యాచ్ లు దాదాపు ముగిశాయి. గత వరల్డ్ కప్ తో పోలిస్తే ఈ ప్రపంచ కప్ లో ఎవరూ ఊహించని విధంగా అనేక అనేక చెత్త రికార్డులు నమోదయ్యియి. మరో ముఖ్యంగా అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో బ్యాట్ పనిచేయలేదు. బంతి మాయ చేసింది. దీంతో స్టార్ బ్యాటర్స్ సైతం పరుగుల చేయడానికి తీవ్రంగా కష్టపడ్డారు. ఫోర్లు, సిక్సర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎందుకంటే ఇక్కడి పిచ్ లపై బంతిని ఎదుర్కోవడానికి కష్టపడిన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల దగ్గరకు వెళ్లడం పెద్దగా కనిపించలేదు.
ఈ వరల్డ్ కప్ 2024 సీజన్ మిగతా సీజన్ల కంటే భిన్నంగా సాగుతోంది.లీడ్ దశలో తక్కువ మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. సూపర్ 8 లో బ్యాట్ పవర్ ను ఆశిస్తున్నారు క్రికెట్ లవర్స్. లీగ్ రౌండ్ మ్యాచ్ లను వెనక్కి తిరిగి చూస్తే ఇదేక్కడి వరల్డ్ కప్ మావా అనే విధంగా మీకు విచిత్రమైన ఘటనలు కనిపిస్తాయి. ముఖ్యంగా సగానికి పైగా జట్లు 100 పరుగులు చేయడానికి కూడా చేయలేని పరిస్థితులను ఎదర్కొన్నాయంటే ఈ టోర్నమెంట్ లో పిచ్ లు ఏ స్థాయిలో ప్రభావితం చేశాయనేది అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో ఏకంగా 9 జట్లు 100 పరుగుల కూడా చేయలేకపోయాయి.
అత్యల్ప స్కోర్లతో చెత్త రికార్డు..
2024 టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ సీజన్‌లో టోర్నీలో అత్యల్ప టోర్నీ రికార్డును కూడా సమం చేసింది. వెస్టిండీస్, ఉగాండా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉగాండా జట్టు కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. 2014లో శ్రీలంకపై నెదర్లాండ్స్ జట్టు ఇదే స్కోరుకే పరిమితమైంది. ఈ సీజన్‌లో 9 సార్లు జట్లు 100లోపు పరుగులు మాత్రమే చేయడంతో చెత్త రికార్డును నమోదుచేశాయి.
న్యూజిలాండ్, శ్రీలంకలు కూడా..
టీ20 ప్రపంచ కప్ 2024 లో అత్యల్ప స్కోర్లు చేసిన జట్లలో న్యూజిలాండ్, శ్రీలంకలు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో అన్ని తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, పపువా న్యూ గినియా 95, ఒమన్ 47, నమీబియా 72, ఉగాండా 39, న్యూజిలాండ్ 75, ఐర్లాండ్ 96, స్కాట్లాండ్ 90, శ్రీలంక జట్టు 77 పరుగులకే ఆలౌట్ అయ్యాయి, టీ20 ప్రపంచకప్‌లో ఇన్ని జట్లు 100లోపు ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
బ్యాటర్స్ భయపెడుతున్న పిచ్..
న్యూయార్క్ పిచ్ లు బౌలర్లకు అనుకూలించడంతో తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. అమెరికా పిచ్‌లు బ్యాట్స్‌మెన్లను భయపెడుతున్నాయి. బౌలర్లు మాత్రం దుమ్మురేపారు. పిచ్ లు అనుకూలించడంతో స్టార్ బ్యాటర్స్ ను సైతం చిన్న బౌలర్లు కూడా చెడుగుడు ఆడుకున్నారు. ఈ పిచ్‌లపై పరుగులు చేయడంలో బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీని కారణంగా ఈ ప్రపంచకప్‌లో తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్‌లతో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చెత్త రికార్డులు కూడా నమోదయ్యాయి.
0 పరుగులు...0 వికెట్లు.. 0 క్యాచ్‌లు.. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులోని ఈ ప్లేయర్ ఎవరో తెలుసా?
- 9 teams including New Zealand and Sri Lanka could not even score 100 runs
- Cricket
- IND vs USA
- IND vs USA T20 World Cup 2024
- India
- India vs USA
- Indian National Cricket Team
- Monank Patel
- Rohit Sharma
- T20 WC
- T20 World Cup
- T20 World Cup 2024
- Team India reach super-8
- USA
- USA Cricket
- USA vs India
- United States vs India
- Virat Kohli
- West Indies
- World Cup
- Worst records in T20 World Cup
- Worst records in T20 World Cup 2024