నా జీవితంలో నేను సంపాదించిన దానికి సంతోషంగా ఉన్నా. నా సోషల్ మీడియా సంపాదన గురించి వైరల్ అవుతున్న వార్త నిజం కాదు... విరాట్ కోహ్లీ ట్వీట్..
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను పంచుకోవడం మాత్రమే కాదు, సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలపై కూడా కన్నేసి ఫాలో అవుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ పూర్తి వేగన్ అని చెప్పి, గుడ్డు తిన్నాడని సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. అప్పుడు ‘రిలాక్స్ బాయ్స్.. నేను వేగన్ అని ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ విరాట్ ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
తాజాగా విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ ద్వారా వస్తున్న ఆదాయంపై ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో వరల్డ్‌లోనే టాప్ 3లో ఉన్న విరాట్ కోహ్లీ, ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్ల ఆదాయాన్ని ఖాతాలో వేసుకుంటున్నట్టు ఓ ఇంగ్లీష్ మీడియా ఛానెల్ ప్రచురించింది..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో విరాట్ కోహ్లీకి A+ కేటగిరిలో ఉన్న విరాట్ కోహ్లీ, బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు అందుకుంటుంటే, కేవలం ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు ఆర్జిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ జరిగింది. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు విరాట్ కోహ్లీ..
‘నా జీవితంలో నేను సంపాదించిన దానికి సంతోషంగా ఉన్నా. నా సోషల్ మీడియా సంపాదన గురించి వైరల్ అవుతున్న వార్త నిజం కాదు...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ.. అయితే ఇన్‌స్టా ద్వారా ఎంత వస్తుందనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు..
విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 50, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్, ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ...
సోషల్ మీడియా ఆదాయం ఎలా ఉన్నా, ప్రస్తుతం ప్రపంచంలో ధనిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్తుల విలువ దాదాపు 1100 కోట్ల రూపాయలకు పైనే ఉందని అంచనా.
ఒక్కో టెస్టు మ్యాచ్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ, ఒక్కో వన్డే మ్యాచ్ ద్వారా రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఇదీ కాకుండా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు..
ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కి రూ.3 కోట్ల వరకూ అందుకుంటున్న విరాట్ కోహ్లీ, ఎంపీఎల్ వంటి 8 రకాల స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే వివో, మింత్రా, ఉబర్, ఎంఆర్‌ఎఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి డజనుకి పైగా బ్రండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు..
