వెల్లింగ్టన్: రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులను చేయగలిగింది. ఇంకా 39 పరుగులు న్యూ జేఅలాండ్ కంటే వెనకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 216/5 తో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజీలాండ్ ను తొలి బంతికే వికెట్ తీసి భారత్ దెబ్బ కొట్టింది.

ఆ తరువాత మరో వికెట్ కూడా కోల్పోయింది దానితో కోహ్లీ సేన మ్యాచ్ పై పట్టు బిగిస్తున్నట్టు కనబడినప్పటికీ కోలిన్ డి గ్రాండ్ హోమ్, జేమిసన్ జోడి భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. 

ఆ తరువాత బౌల్ట్ మెరుపులు భారత్ మీద న్యూజిలాండ్ కు 183 పరుగుల లీడ్ ని తీసుకువచ్చింది. భారత్ బ్యాట్స్ మెన్ కు చాలా కఠినమైన బాధ్యతను అప్పగించింది న్యూజిలాండ్. మరో సారి అగ్గ్రెస్సివె గా ఆడుతున్న పృథ్వీ షా త్వరగా అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు. 

ఆ తరువాత పుజారా కూడా బాల్ ని అంచనా వేయడంలో విఫలమై అవుట్ అయ్యాడు. అర్థశతకం సాధించిన మయాంక్ అగర్వాల్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. కోహ్లీ కూడా మరోసారి నిరాశపరిచాడు. ఆ తరువాత వార్మ్ అప్ మ్యాచ్ శతక హీరో హనుమ విహరితో కలిసి రహానే క్రీజులో కొనసాగుతున్నారు. ఈ జోడి రేపు ఎలా ఆడుతుందని దానిలో మీదనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. 

Also read; న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: ఇషాంత్ శర్మ అరుదైన ఘనత

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. అతను 43 బంతుల్లో 19 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగులో వెనుదిరిగాడు.

ఇషాంత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శనతో న్యూజిలాండ్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్సును 348 పరుగులకే ముగించింది. ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్సులో అతను ఐదు వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి.