హామిల్టన్: సూపర్ ఓవరు ఆడాల్సి వస్తుందని ఊహించలేదని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. దాంతో తనకు సంబంధించిన వస్తువులను అన్నింటినీ ముందే బ్యాగులో సర్దేసుకున్నట్లు తెలిపాడు. తన వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయని ఆయన అన్నారు.

అబ్డామిన్ గార్డ్ వెతకడానికి ఐదు నిమిషాలు పట్టిందని రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చూస్తే సూపర్ ఓవరు గురించి ఆలోచనే రాలేదని చెప్పాడు. కివీస్ సులభంగా గెలుస్తుందని ఆనిపించిందని ఆయన అన్నాడు. 

Also Read:చివరి ఓవరులో పేసర్ షమీ తడాఖా: సూపర్ రో'హిట్'.

సూపర్ ఓవర్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంపై ప్రాక్టీస్ ఏదీ ఉండదని, అదే బౌలర్ కైతే ఏ ఓవరైనా ఒకేలా ఉంటుందని రోహిత్ శర్మ అన్నాడు. తాను 60 పరుగులు చేయకుంటే తన బదులు శ్రేయస్ అయ్యరో, మరొకరో వచ్చి ఉండేవారని అన్నాడు.

సౌథీ సవాల్ గా తీసుకుని బౌలింగ్ చేశాడని, మామూలుగా అయితే సూపర్ లో బౌలర్ పై ఒత్తిడి ఉంటుందని, అందుకే ప్రశాంతంగా బ్యాటింగ్ చేశానని చెప్పాడు. చివరలో క్రీజులో ఉండాలా, ముందుకొచ్చి ఆడాలా అనే ఆలోచనలు వచ్చాయని, సౌథీ తన పరిధిలో బంతులు వేయడంతో చితకబాదానని చెప్పాడు.

Also Read: బెన్నెట్ కు చుక్కలు చూపించిన రోహిత్: ఒక్క ఓవరులో 26 పరుగులు

ఎంతో శ్రమించినా కూడా న్యూజిలాండ్ కు విజయం దక్కకపోవడం వారికి నిరాశే కలిగించి ఉంటుందని రోహత్ శర్మ అన్నాడు. ఇండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 179 పరుగులు చేసి స్కోరును సమం చేసింది. దీంతో టై అయిపోయి సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చిందని. 

సూపర్ ఓవరులో న్యూజిలాండ్ 17 పరుగులు చేయగా, ఇండియా 18 పరుగులు చేసి మ్యాచును గెలుచుకుంది. చివరి రెండు బంతుల్లో రోహిత్ శర్మ వరుసగా సిక్స్ లు కొట్టి ఇండియాకు విజయాన్ని అందించాడు.