క్రికెట్ గ్రౌండ్‌లలో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని స్టేడియంలో విషాదానికి కారణమవుతాయి. తాజాగా ఓ క్రికెటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి భద్రతా సిబ్బందికి తగిలింది.

వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ జరుగుతోంది. దీనిలో భాగంగా శనివారం హామిల్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. అప్పటికే కివీస్ 365 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది.

Also Read:ప్రియాంక రెడ్డి ఘటన: కోహ్లీ, అంబటి రాయుడు స్పందన ఇదీ...

ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన  బంతిని న్యూజిలాండ్ ఆటగాడు శాంట్నర్ మిడాన్ దిశగా సిక్స్‌గా బాదాడు. గాల్లోకి లేచిన ఆ బంది నేరుగా వెళ్లి బౌండరీ లైన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఒక సెక్యూరిటి సిబ్బందికి తగలడంతో పాటు పక్కనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న మహిళా ప్రేక్షకురాలిగా సైతం తగిలింది.

ఈ ఘటనతో బిత్తరపోయిన క్రికెటర్లు, అంపైర్లు సెక్యూరిటీ సిబ్బంది వద్దకు పరిగెత్తడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. సదరు వ్యక్తి తనకు ఏం కాలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:ఇంత వివక్షా... క్రీడా సమాఖ్యల పరిపాలనకు మహిళలు పనికిరారా?

తర్వాత అతనికి విధుల నుంచి విశ్రాంతినిచ్చి వైద్య సేవలు అందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.