వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ అదరగొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదటి టెస్టు ఆడుతున్న వెస్టిండీస్... టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకుంది. పచ్చగా కళకళలాడుతున్న పిచ్‌పై ఆతిథ్య కివీస్‌ను ఇబ్బంది పెట్టొచ్చని భావించింది. అనుకున్నట్టుగానే మొదటి వికెట్‌ను త్వరగా పడగొట్టింది.

అయితే ఆ తర్వాతే సీన్ మారింది. బౌలింగ్‌కి అనుకూలించే పిచ్‌పై లాథమ్ 86, రాస్ టేలర్ 38 పరుగులతో రాణించగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 251 పరుగులు చేసి అదగరొట్టాడు. టెస్టుల్లో కేన్ విలియంసన్‌కి ఇది మూడో డబుల్ సెంచరీ. 

న్యూజిలాండ్ బౌలర్ జేమ్మీసన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 519 పరుగుల భారీ స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది కివీస్. రెండో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ కోల్పోకుండా 26 ఓవర్లలో 49 పరుగులు చేసింది విండీస్.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన కేన్ విలియంసన్ డబుల్ సెంచరీపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభినందనల వర్షం కురిపిస్తుండడం విశేషం.