అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్‌ అంటూ ప్రకటించినా, నాటౌట్‌గా తేల్చిన థర్డ్ అంపైర్...అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్... 

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌‌ను నేలను తాకుతూ డేవిడ్ మలాన్ పట్టిన క్యాచ్‌కి థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్ట్రైయిక్ షాట్ ఆడబోయాడు. వెంటనే స్పందించిన బౌలర్ జెమ్మీసన్, డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్‌ అంటూ ప్రకటించినా, టీవీ రిప్లైలో బంతి పట్టిన తర్వాత నేలను తాకుతున్నట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

Scroll to load tweet…

ఈ నిర్ణయంపై కేల్ జెమ్మీసన్, అంపైర్లపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది ఐసీసీ. కేల్ జెమ్మీసన్‌ను ఐపీఎల్ 2021 వేలంలో రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...