తండ్రైన బుమ్రా కి పాక్ క్రికెటర్ స్పెషల్ గిఫ్ట్..!
తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు కూడా పెట్టేశారు. కాగా, తండ్రి అయిన కారణంగా బుమ్రాకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుటుంబంలో ఆనందం నెలకొంది. బుమ్రా- సంజనా గణేశన్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. బుమ్రా సతీమణి సంజన్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన బుమ్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు కూడా పెట్టేశారు. కాగా, తండ్రి అయిన కారణంగా బుమ్రాకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.
కాగా, తాజాగా ఆయనకు పాకిస్తాన్ క్రికెటర్ షాహిన్ అఫ్రిది శుభాకాంక్షలు తెలియజేడంతో పాటు, గిఫ్ట్ కూడా పంపాడు. ఆదివారం భారత్, పాక్ జట్లు ఆసియాకప్ 2023లో భాగంగా మ్యాచ్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. మళ్లీ, ఆ మ్యాచ్ ఈ రోజు జరగుంది. అయితే, మ్యాచ్ ఆగిపోయిన తర్వాత జస్‍ప్రీత్ బుమ్రా దగ్గరకు పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది వచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. తండ్రి అయినందుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
ముబారక్ బుమ్రా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా చూడాలి. మరో కొత్త బుమ్రాను తయారు చేయండి అని షాహిన్ అఫ్రిది తెలిపాడు. అనంతరం ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వారిద్దరూ చూపించిన క్రీడా స్ఫూర్తికి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.