Asianet News TeluguAsianet News Telugu

నేను భారత్ ఓడిపోతుందని చెప్పానా, ఎక్కడ: పాక్ మాజీ బౌలర్‌‌ను కడిగేసిన స్టోక్స్

ఎన్నో అంచనాలతో 2019 వన్డే ప్రపంచకప్‌లో రంగంలోకి దిగిన టీమిండియా సెమీ ఫైనల్లోనే వెనుదిరిగింది. లీగ్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన భారత్.. కేవలం ఇంగ్లాండ్ చేతిలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఆ

Never said India lost deliberately to England at World Cup 2019: Ben Stokes
Author
London, First Published May 29, 2020, 3:42 PM IST

ఎన్నో అంచనాలతో 2019 వన్డే ప్రపంచకప్‌లో రంగంలోకి దిగిన టీమిండియా సెమీ ఫైనల్లోనే వెనుదిరిగింది. లీగ్ మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన భారత్.. కేవలం ఇంగ్లాండ్ చేతిలో మాత్రమే ఓటమి చవిచూసింది.

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ సమరంలో టీమిండియా ఓడిపోవడంతో మన ఫైనల్ ఆశలు నెరవేరలేదు. అయితే ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై పెద్ద దుమారం రేగింది.

పాకిస్తాన్‌ను సెమీఫైనల్‌కు చేరకుండా అడ్డుకోవడానికే ఇంగ్లీష్ జట్టు చేతిలో టీమిండియా ఓటమి పాలైందని వార్తలు వచ్చాయి. అయితే ఇవే మాటల్ని ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెన్‌స్టోక్స్ రాసిన ‘ఆన్ ఫైర్’ పుస్తకంలో ప్రస్తావించినట్లు  పాక్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ ఆరోపించాడు.

Also Read:తెలుగు సినిమాను వదలని డేవిడ్ వార్నర్: రేపటి నుంచి ‘‘ మైండ్ బ్లాక్ ’’

ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందనే విషయాన్ని స్టోక్స్ వెల్లడించాడంటూ మండిపడ్డాడు. దీనిపై ఓ అభిమాని అతనిని ప్రశ్న రూపంలో అడిగాడు. ఆ కామెంట్‌ను  స్టోక్స్ పుస్తకంలో ఎక్కడ చేశాడో చెప్పాలంటూ సవాల్ చేశాడు.

అదే సమయంలో స్టోక్స్ కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగి, తాను ఎక్కడ ఆ విషయాన్ని చెప్పానో చెప్పాలంటూ నిలదీశాడు. దానిని తాను చెప్పనప్పుడు వెతికి పట్టుకోవడం కుదరపని అంటూ ఎద్దేవా చేశాడు.

ఆ పుస్తకంలో ధోని ఆడుతున్నప్పుడు ఉన్న రన్‌రేట్‌ను స్టోక్స్ ప్రస్తావించాడు. ఒకవేళ భారత్ ఓడిపోయినా అదే రన్‌రేట్‌ను ధోని కడవరకూ కొనసాగిస్తే భారత్‌కు మంచి రన్‌రేట్ ఉంటుందని మాత్రమే పేర్కొన్నాడు.

Also Read:ధోనీ రిటైర్మెంట్ పై సాక్షి షాకింగ్ ట్వీట్.. వెంటనే డిలీట్..

దీనిని సికిందర్ బక్త్ మాత్రం పాకిస్తాన్ అడ్డుకోవడానికి ఆపాదించుకున్నాడు. రన్‌రేట్ అంశాన్ని స్టోక్స్ పేర్కొనడం పాకిస్తాన్ నాకౌట్ ఆశల్ని నీరుగార్చడం కోసం జరిగిన ప్రణాళికగా బక్త్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 337 పరుగులు చేయగా, భారత్ 306 పరుగులకే పరిమితమయ్యింది. రోహిత్‌ శర్మ(102), కోహ్లి(66), రిషభ్‌ పంత్‌(32), హార్దిక్‌ పాండ్యా(45), ఎంఎస్‌ ధోని(42 నాటౌట్‌)లు ధాటిగా ఆడినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios