కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాల క్రీడలు వాయిదా పడ్డాయి. ఇందుకు క్రికెట్ కూడా అతీతం కాదు. ఎలాంటి టోర్నమెంట్‌లు లేకపోవడంతో క్రికెటర్లంతా కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍

A post shared by David Warner (@davidwarner31) on May 28, 2020 at 11:36pm PDT

 

 

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ చేసిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పటికే బుట్టబొమ్మ, పోకిరి డైలాగ్, బాహుబలి సాంగ్‌కు భార్య, కుమార్తెతో కలిసి చేసిన వీడియోలతో వార్నర్‌కు ఫాలోవర్స్ బాగా పెరిగారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్‌టాక్ చేయమని వార్నర్‌ను అభిమానులు కోరుతున్నారు.

ఇప్పటికే ఆ సాంగ్‌లోని చిన్న బిట్‌కు వార్నర్ టిక్ టాక్ చేయగా... తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్ 1ను శనివారం పోస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్ టాక్ చేస్తున్నట్లు చెప్పకుండా సర్‌ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు.

దీంతో వార్నర్ అభిమానులు వచ్చే టిక్ టాక్ మైండ్ బ్లాక్‌ మీద అని ఫిక్సయ్యారు. ఇక బాహుబలి చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ మీరు మాలో ఎవరిని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారు. చెప్పండి అంటూ ప్రశ్నించాడు.