Cristiano Ronaldo: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిన్న తన లీగ్ ఫుట్‌బాల్ కెరీర్ లో 700 వ గోల్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యువీ చేసిన ఓ ట్వీట్  పై నెటిజన్లు అతడిని ఆటాడుకుంటున్నారు. 

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా మక్కువ ఎక్కువ. గతంలో అతడు తనకు ఇష్టమైన ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ యూనైటైడ్ కు సంబంధించిన విజయాలపై ట్వీట్స్ కూడా చేశాడు. తాజాగా యువీ.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్ పై స్పందిస్తూ ట్విటర్ లో చేసిన ఓ ట్వీట్ మాత్రం మిస్ ఫైర్ అయింది. అలవాటులో పొరపాటుగా యువీ.. ఫుట్‌బాల్ ఆటలో కూడా క్రికెట్ పరిభాషనే వాడి అడ్డంగా బుక్కయ్యాడు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యువీని ఆటాడుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అసలు విషయానికొస్తే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో భాగంగా మాంచెస్టర్ యూనైటైడ్ తరఫున ఆడుతున్న రొనాల్డో.. నిన్న ఎవర్టన్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా లీగ్ ఫుట్‌బాల్ కెరీర్ లో 700 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డోకు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు వెల్లువెత్తాయి. 

ఈ నేపథ్యంలో యువీ కూడా ఓ ట్వీట్ చేస్తూ.. ‘కింగ్ ఈజ్ బ్యాక్. ఫామ్ తాత్కాలికం. క్లాస్ శాశ్వతం.. 700 క్లబ్ కు స్వాగతం రొనాల్డో.. నెంబర్ 7 గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)..’ అని ట్వీట్ చేశాడు. ఇదే యువీ కొంపముంచింది. ఈ జాబితాలో రొనాల్డో తప్ప మరెవరూ లేరు. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో 700 గోల్స్ కొట్టిన తొలి ఫుట్బాలర్ రొనాల్డో మాత్రమే. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆటాడుకున్నారు. 

Scroll to load tweet…

యువీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే పలువురు నెటిజన్లు దానిపై స్పందిస్తూ.. ‘700 క్లబ్ లో ఉన్నది ఒకడే ఒక్కడు. అది కూడా రొనాల్డోనే. మళ్లీ క్లబ్ కు స్వాగతమేంటి..? ఇంతకుముందు నువ్వేదో అందులో ఉన్నట్టు..’, ‘ఏంటి నువ్వు ఆ క్లబ్ ఓపెన్ చేశావా..?’ ‘స్వాగతమా..? దేనికి..? భాయ్.. అవి రన్స్ కాదు.. గోల్స్’, ‘మీరు ఏ 700 క్లబ్ గురించి మాట్లాడుతున్నారు సార్..?’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…