టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోడల్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటాషా.. హార్దిక్ తో ప్రేమ తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది.

కాగా.. తాజాగా.. నటాషా తన సోషల్ మీడియాలో ఓ ఫోటో  విడుదల చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. నటాషా బీచ్‌లో నల్లరంగు బికినీలో కెమెరా  కోసం ఫోజులిచ్చారు. ఆ చిత్రాలను తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రాంలో ‘విటమిన్ సీ’ (విటమిన్ సముద్రం)అంటూ క్యాప్షన్‌తో  పోస్టు చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💭All I need is a good dose of vitamin sea 🌊 🧜🏼‍♀️🐠☀️🐚 #tb

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Jun 22, 2020 at 6:24am PDT

 

కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లని నటాషా తాను గతంలో బీచ్‌లో దిగిన బికినీ చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.తనకు కావాల్సింది సముద్రమంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

నటాషా సెర్బియా మోడల్, సినీనటి. ఆమె బిగ్ బాస్ 8తో వినోదరంగంలోకి అడుగుపెట్టింది.నటాషా ‘సత్యాగ్రహ’, ‘ఫుక్రీ రిటర్న్స్’ చిత్రాల్లో నృత్య సన్నివేశాల్లో కనిపించింది.నటాషాకు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో నిశ్చితార్థం జరిగింది.

కాగా.. ప్రస్తుతం నటాషా కడుపుతో ఉండగా..హార్దిక్, నటాషాలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.