ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని ప్రియురాలు నటాషా స్టాంకోవిక్ తొలి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ వస్తున్నారు. ఎలాంటి విషయాలైనా సరే అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

అయితే త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం హర్దిక్ పాండ్యా యూఏఈలో ఉన్నాడు. కాబోయే భర్తను నటాషా బాగా మిస్సవుతోంది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హార్డిక్‌తో కలిసి వున్న ఫోటోను పోస్ట్ చేసింది.

ఈ జంట తమ బిడ్డకు ఆగస్త్య అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బాబు గుజరాత్‌లోని ఆనంద్‌లో వున్న ఆకాంక్ష ఆసుపత్రిలో పుట్టాడు. తమ జీవితంలోకి ఆగస్త్యను తీసుకొచ్చినందుకు గాను హార్దిక్- నటాషాలు అక్కడి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా ఈ ఏడాది జనవరిలో నటాషాకు హార్దిక్ తన మనసులోని మాటను చెబుతూ ఉంగరాన్ని బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

సెర్బియన్ నటి అయిన నటాషా.. ప్రకాశ్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2014-2015లో రియాలిటీ షో ‘‘ బిగ్ బాస్ 8’’లో పాల్గొని  మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పుక్రీ రిటర్న్స్, మెహబూబా, జిందగీ మేరి డ్యాన్స్ డ్యాన్స్, డాడీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. దీనితో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లో కొన్ని ఐటెం సాంగుల్లో కూడా నటించింది. నటాషా చివరి సారిగా డ్యాన్స్ రియాలిటీ షో ‘‘ నాచ్ బాలియే 9’’లో టీవీ నటుడు, స్నేహితుడు అలీ గోనీతో కలిసి కనిపించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💙 you @hardikpandya93 #us #tb #missinghim

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Sep 11, 2020 at 4:21am PDT