Junior World Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ షూటర్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. నిండా 15 ఏళ్లు కూడా లేని నామ్యా కపూర్ ఏకంగా బంగారు పతకం సాధించడం గమనార్హం. 

పెరూ వేదికగా జరుగుతున్న ఇంటర్నషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో ఔరా అనిపిస్తున్నారు. సోమవారం జరిగిన బాలికల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 14 ఏళ్ల ఢిల్లీ అమ్మాయి నామ్యా కపూర్ (NaamyaKapoor) స్వర్ణం గెలుచుకుంది.

Scroll to load tweet…

ఈ పోటీలో నామ్యా 36 పాయింట్లు సాధించగా.. ఫ్రాన్స్ షూటర్ క్యామిల్ 33 పాయింట్లతో రజతం నెగ్గింది. కాగా, మరో భారతీయ షూటర్ మనూ బాకర్ (Manu Bhaker) 31 పాయింట్లతో కాంస్యం నెగ్గడం గమనార్హం. ఇదిలాఉండగా.. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్ లో భారత యువ షూటర్ ఐశ్వర్య్ ప్రతాప్ సింగ్ (Aishwarypratapsinghtomar) కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

Scroll to load tweet…

463.4 పాయింట్లతో కొత్త రికార్డు సృష్టించిన ఐశ్వర్య్.. ఈ పోటీలో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇప్పటికే ఈ ఛాంపియన్షిప్ లో భారత్ ఏడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. భారత మహిళా షూటర్ మనూ బాకర్ ఒక్కతే ఈ టోర్నీలో మూడు స్వర్ణాలు నెగ్గింది.