ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ‘ఈసారి కప్పు మనదే’ అంటూ 13 ఏళ్లుగా విరాట్ ఫ్యాన్స్, ఐపీఎల్ టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ ప్రదర్శనలో ఘోరంగా విఫలమైనా... తమ జట్టుపై ఇప్పటిదాకా ఛీటింగ్ ఆరోపణలు రాలేదని, చెన్నైలా రెండేళ్లు బ్యాన్ కాలేదని, ముంబై టీమ్‌లా మాకు అంపైర్ల సపోర్టు కూడా లేదని, అందుకే కోహ్లీ టీమ్ బెస్ట్ అని చెబుతూ ఉంటారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. 

తాజాగా మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఆర్‌సీబీ. కోవిద్ హీరోలకు నివాళులు తెలుపుతూ, ‘మై కోవిద్ హీరోస్’ అని రాసి ఉన్న జెర్సీలను ధరించనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

కరోనా సమయంలోనూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, కరోనాను ఎదుర్కొని గెలిచిన వీరుల పోరాటానికి గుర్తుగా ‘మై కోవిద్ హీరస్’ అని రాసి ఉన్న జెర్సీలను ఆవిష్కరించారు.