ఐపీఎల్‌‌ ప్రారంభానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యా తన న్యూలుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు

ఐపీఎల్‌‌ ప్రారంభానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యా తన న్యూలుక్‌ను అభిమానులతో పంచుకున్నాడు.

మొత్తం 8 జట్ల ఆటగాళ్లు వర్కవుట్లు., ప్రాక్టీస్ సెషన్‌ వీడియోలను పోస్ట్ చేయడంలో బిజీగా ఉండగా క్రునాల్ మాత్రం కొత్తగా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నాలుగు ఫోటోలు పోస్ట్ చేశాడు.

‘‘ కొత్త సీజన్, కొత్త లుక్, మీకు ఇష్టమైనది ఏది’’ అని అభిమానులను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన క్రునాల్ భార్య పంఖూరి శర్మ, క్రికెటర్ దినేశ్ కార్తీక్ పైవన్నీ అని సమాధానం ఇవ్వగా.. మరో బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ 4వ నెంబర్ చిత్రాన్ని ఎంచుకున్నాడు.

2016లో ముంబై తరపున ఐపీఎల్ ‌లోకి అడుగుపెట్టిన క్రునాల్ పాండ్యా ఇప్పటి వరకు 55 మ్యాచ్‌ల్లో పాల్గొని 891 పరుగులు చేసి 40 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్ 13 వ సీజన్‌ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనుంది.

డిఫెండింగ్ ఛాంపియన్, నాలుగు సార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ సెప్టెంబర్ 19న అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. 

View post on Instagram