ఉత్కంఠ నడుమ చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి.. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. మ్యాచ్ ముగిసిన రోజు హైదరాబాద్‌లో  సంబరాలు జరుపుకున్న ముంబై సభ్యులు... సోమవారం రాత్రి సొంతగడ్డపై భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ముంబైకి చేరుకున్న ఆటగాళ్లని జట్టు యాజమాన్యం ఓపెన్ టాప్ బస్సులో నగరంలో ఊరేగించింది. ముంబై ఆటగాళ్లంతా ఆనందం వ్యక్తం చేస్తూ... అభిమానులకు అభివాదం చేశారు.