ఐపీఎల్ 2021 సీజన్‌కి సర్వం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మొదటి మ్యాచ్‌తో 14వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది.

ముంబై ఇండియన్స్ స్కాట్, వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కిరణ్‌కి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అతన్ని ఐసోలేషన్‌కి తరలించారు. క్వారంటైన్ నిబంధనల కారణంగా డి కాక్, కిరన్ పోలార్డ్ లేకుండానే మొదటి మ్యాచ్ ఆడనున్న ముంబైకి ఈ వార్త, కొత్త తలనొప్పులు క్రియేట్ చేసేదే...

ఐపీఎల్ సమీపిస్తున్నా, కరోనా పాజిటివ్ కేసులు ఇంకా నమోదు అవుతుండడం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది... మంగళవారం ఉదయం వాంఖడే స్టేడియంలో విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరు గ్రౌండ్‌మెన్, ఓ ప్లంబర్ కరోనా బారిన పడ్డారు.