నేడు ముంబయి ఇండియన్స్.. కోల్ కతా నైట్ రైడర్స్  (Kolkata Knight Riders) తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. అభిమానులను ముందుగానే ఉత్సాహపరించేందుకు ఓ శాంపిల్ వీడియో విడుదల చేశారు. 


ఐపీఎల్(IPL2021) 14వ సీజన్ లో విజయం సాధించి.. తమ జట్టుకు తిరుగులేదని నిరూపించుకోవడానికి డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ జట్టు.. అందరికంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి కూడా విజయం సాధించడానికి రోహిత్ సేన కసరత్తులు చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కాగా.. నేడు ముంబయి ఇండియన్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. అభిమానులను ముందుగానే ఉత్సాహపరించేందుకు ఓ శాంపిల్ వీడియో విడుదల చేశారు.

View post on Instagram

ఆ వీడియోలో.. కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma),కీరాన్ పోలార్డ్( Kieron Pollard) సూర్యకుమార్ యాదవ్( Suryakumar Yadav) లు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కాగా.. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ లో.. ఈ బ్యాట్స్ మెన్ లు.. భారీ షాట్లు ఆడటం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీరి షార్ట్స్ కి మాంచి బాలీవుడ్ మ్యూజిక్ ని జత చేయగా.. ముంబయి అభిమానులు ఈ వీడియో చూసి ఉర్రూతలూగుతున్నారు. 

ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్లు.. ఆటతోపాటు పాటకు న్యాయం చేయడం విశేషం. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముంబయి ఇండియన్స్ అధికారిక ఖాతాలో ఈ వీడియోని షేర్ చేయడం విశేషం.