Asianet News TeluguAsianet News Telugu

ధోనీ గొప్ప ఫినిషర్.. రికీ పాంటింగ్ ప్రశంసలు..!

క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా అతను ఎప్పటికీ గుర్తుండిపోతానని ఆయన చెప్పాడు.

MS Dhoni Will Retire "As One Of The Greatest Finishers Of The Game": Ricky Ponting
Author
Hyderabad, First Published Oct 12, 2021, 10:42 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ లో గొప్ప ఫినిషర్లలో ధోనీ ఒకడు అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నారు.

ధోనీ గొప్ప ఆగాళ్లలో ఒకడు అని రికీ పేర్కొన్నాడు. తాము డగౌట్లో కూర్చొని.. తర్వాత వచ్చేది జడేజానా, ధోనీనా అని ఆలోచించామని.. తానైతే ధోనీ వచ్చి ముగించడానికి ప్రయత్నిస్తాడని చెప్పానని రికీ పేర్కొన్నాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా అతను ఎప్పటికీ గుర్తుండిపోతానని ఆయన చెప్పాడు.

క్వాలిఫయర్ -1లో ధోనీ ఆఖర్లో ధనాధన్ బ్యాటింగ్ తో ఢిల్లీపై చెన్నైని గెలిపించాడు.  ఆ రోజు ఢిల్లీతో  చెన్నై విజయంతో.. ధోనీ జట్టు.. డైరెక్ట్ గా ఫైనల్స్ కి చేరుకుంది. ధోనీ ప్లానింగ్ ప్రకారం బౌలింగ్ చేయడందో ఢిల్లీ బౌలర్లు విఫలమయ్యారని.. రికీ పాంటింగ్ పేర్కొన్నారు. 

కాగా.. ఆ నాటి మ్యాచ్ లో  ఆరు బంతుల్లో ఒక సిక్సర్.. మూడు ఫోర్లతో చెన్నైని వరుసగా తొమ్మిదో సారి ఫైనల్ చేర్చిన ఆ జట్టు సారథి ధోని ఆటకు ట్విట్టర్ సలాం అంటున్నది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మొదలు.. సాధారణ క్రికెట్ అభిమాని వరకు ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కేదార్ జాదవ్, సురేశ్ రైనాతో పాటు భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ధోని ఆటకు ఫిదా అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios