భారత క్రికెట్ పై మహేంద్ర సింగ్ ధోని చెరగని ముద్ర వేసాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా, కీపర్ గా జట్టును ముందుండి 16 సంవత్సరాలపాటు నడిపించాడు. అనూహ్యంగా నిన్న రాత్రి తన కెరీర్ కి ముగింపు పలికేసాడు. 

ధోని రిటైర్మెంట్ తో ఒకింత అందరూ తొలుత షాక్ కి గురైనా.... నెమ్మదిగా ఏ క్రికెటర్ కి అయినా రిటైర్మెంట్ సహజం అని అర్థం చేసుకొని అతని సెకండ్ ఇన్నింగ్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

ధోని భార్య సాక్షి ఇంస్టాగ్రామ్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. " నువ్వు సాధించిన వాటి వల్ల గర్వంగా ఉండు. ఆటకు నీ బెస్ట్ ఇచ్చినందుకు శుభాకాంక్షలు. నమనిషిగా నువ్వన్నా, నువ్వు సాధించిన విజయాల అన్న నాకెంతో గర్వకారణం. కన్నీటిని పంటిబిగువున ఆపుకొని నీ పాషన్ కి గుడ్ బై చెప్పి ఉంటావు. రానున్న కాలంలో ఆరోగ్యంగా, సంతోషంగా, అద్భుతమైన విషయాలతో నీ జీవితం నిండాలని కోరుకుంటున్నాను అని సాక్షి అన్నారు. ఇక ముగిస్తూ మీరు అభిమానులకు ఇచ్చిన ఫీలింగ్ ఎల్లకాలం గుర్తిండిపోతుందంటూ ఒక కొటేషన్ ని రాసుకొచ్చారు.