Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: ‘సౌత్’ను ఏలడానికి వస్తున్న జార్ఖండ్ డైనమైట్.. ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రారంభించిన ధోని

MS Dhoni Entertainment: సుమారు దశాబ్దం పాటు భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన  టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని.. మరో కొత్త అవతారం ఎత్తనున్నాడు. త్వరలోనే అతడు దక్షిణాది భాషలలో సినిమాలు తీయనున్నాడు. 

MS Dhoni Launched Film Production, Named it  MS Dhoni Entertainment
Author
First Published Oct 10, 2022, 11:03 AM IST | Last Updated Oct 10, 2022, 11:03 AM IST

భారత క్రికెట్ లో మాస్టర్ మైండ్ గా  గుర్తింపుపొందిన మహేంద్ర సింగ్ ధోని త్వరలో కొత్త  అవతారం ఎత్తనున్నారు.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండేండ్ల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు.  ఐపీఎల్ తో పాటు రాంచీలో తన వ్యాపారాలు చూసుకుంటున్న ధోని.. త్వరలోనే  తనకు కోట్లాది అభిమానులున్న తమిళనాడు నుంచి మరో కొత్త పాత్రలో ప్రవేశించబోతున్నాడు. దక్షిణాదిలో సినిమాలు  నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్న ధోని తాజాగా.. ‘ఎంఎస్ ధోని ఎంటర్‌టైన్మెంట్స్’ను  ప్రారంభించాడు. 

MS Dhoni Entertainment పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించబోతున్నట్టు  ధోని ప్రకటించాడు.  తమిళ్ లో రజినీకాంత్ కు ఎంత క్రేజ్ ఉందో ధోనికి కూడా   ఆ స్థాయిలో అభిమానులున్నారు. ధోనిని ‘తాలా’ అని పిలుచుకునే తమిళ తంబీలను ఐపీఎల్ నుంచి  రిటైరైనా మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ధోని.. తన కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారని అతడి వర్గీయులు చెబుతున్నారు. 

తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ధోని తమిళంతో పాటు తెలుగు, మళయాలంలలో  కూడా సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మేరకు  కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ధోనికి ఇదివరకే ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ పేరిట  ఓ ప్రొడక్షన్  హౌజ్ ఉంది.  ఈ సంస్థ ఇప్పటికే రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ది హిడెన్ హిందూ  చిన్న సినిమాలను నిర్మించింది. 

 

రోర్ ఆఫ్ లయన్.. చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించిన సినిమా. ఐపీఎల్ లో రెండేండ్ల నిషేధం ఎదుర్కున్న తర్వాత  ఆ జట్టు ఎదిగిన తీరును అందులో ప్రస్తావించారు. బ్లేజ్ టు గ్లోరీ.. ఒక డాక్యుమెంటరీ. భారత జట్టు  2011 ప్రపంచకప్ నకు సంబంధించిన  అంశాలను అందులో చూపించారు. ఇక హిడెన్ హిందూ.. ఒక మైథాలాజికల్ థ్రిల్లర్. అక్షత్ గుప్తా రాసిన ఈ నవలను సినిమాగా తెరకెక్కించారు. అయితే ఈ చిన్న సినిమాలు, డాక్యుమెంటరీలు కాదు.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని చూస్తున్నాడు ధోని. తమిళ్, తెలుగు, మళయాలంలలో  భారీ సినిమాలు తీసి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి క్రికెట్ లో అత్యంత విజయవంతమైన ఈ జార్ఖండ్ డైనమైట్.. సినిమాలలో ఏ మేరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios